AP Govt : ఏపీలోని పేద వర్గాల ప్రజలకు భారీ ఊరట.. లక్షలు ఖర్చు చేయాల్సిన పనిలేదు.. ప్రభుత్వాస్పత్రుల్లో బోన్‌మ్యారో చికిత్స..

AP Govt Bone Marrow Treatment : ఏపీలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు భారీ ఊరట లభించనుంది.

AP Govt Bone Marrow Treatment

AP Govt Bone Marrow Treatment : ఏపీలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు భారీ ఊరట లభించనుంది. రాష్ట్రంలోని మూడు ప్రభుత్వాస్పత్రుల్లో బోన్‌మ్యారో చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీలోని కూటమి ప్రభుత్వం హైకోర్టులకు తెలిపింది.

Also Read : AP Weather : ఏపీలో వేగంగా మారుతున్న వాతావరణం.. 15జిల్లాలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో అత్యంత ఖరీదైన బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స అందుబాటులో లేదంటూ వెంకటసాయికుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది (ఎస్‌జీపీ) ప్రణతి మాట్లాడుతూ.. విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి, గుంటూరు ప్రభుత్వాస్పత్రితోపాటు కర్నూలోని స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో బోన్ మ్యారో చికిత్సకు అవసరమైన ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధికి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రతిపాదనలు పంపారని కోర్టు వివరించారు.

బడ్జెట్ ఆమోదం కోసం ఫైలు ప్రస్తుతం ఆర్థికశాఖ వద్ద ఉందని, ఫైల్ ఆమోదం పొందిన తరువాత ఎప్పటిలోగా చికిత్స అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టత వస్తుందని కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను సమర్పించేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వ తరపున న్యాయవాది కోరారు.

సాధ్యమైనంత త్వరగా బోన్‌మ్యారో చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అంతేకాక.. ఎప్పటిలోగా చికిత్సను అందుబాటులోకి తీసుకొస్తారో స్పష్టతనిస్తూ.. పురోగతిపై వివరాలను సమర్పించాలని కోర్టు సూచించింది. అంతకాక.. వివిధ ప్రభుత్వ పథకాల కింద రోగులకు అందించే ఆర్థిక సహాయం పరిమితిని పెంచే విషయాన్ని పరిశీలించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో బోన్ మ్యారో చికిత్స కోసం రూ. 10లక్షల నుంచి రూ.40లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ చికిత్స అందుబాటులోకి వస్తే ఖర్చు భారీగా తగ్గుతుంది. ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపినట్లుగా.. రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో బోన్‌మ్యారో చికిత్స అందుబాటులోకి వస్తే పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈ వైద్యం సాధ్యమైనంత వరకు రాయితీ లేదంటే ఉచితంగా అందించే అవకాశం ఉండటంతో ఎంతోమందికి మేలు జరగనుంది.