3 రాజధానుల ఎఫెక్ట్ : విశాఖలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి కీలక నేత

విశాఖలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి, విశాఖ నగర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ రెహమాన్ రాజీనామా చేశారు. ఆయన వైసీపీలోకి వెళ్తున్నారు.

  • Publish Date - December 26, 2019 / 06:56 AM IST

విశాఖలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి, విశాఖ నగర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ రెహమాన్ రాజీనామా చేశారు. ఆయన వైసీపీలోకి వెళ్తున్నారు.

విశాఖలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి, విశాఖ నగర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ రెహమాన్ రాజీనామా చేశారు. ఆయన వైసీపీలోకి వెళ్తున్నారు. డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో రెహమాన్ వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. విశాఖను రాజధానిగా చేయడానికి టీడీపీ ఒప్పుకోకపోవడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు రెహమాన్ తెలిపారు. 

కొంతకాలంగా టీడీపీ అధినాయకత్వం పట్ల రెహమాన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అయితే అప్పట్లో ఆయన ఈ ప్రచారాన్ని ఖండించారు. తాజాగా టీడీపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు వరకు పార్టీ విశాఖ నగర అధ్యక్షుడిగా వ్యవహరించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ను తప్పించి రెహమాన్ ను నియమించారు. గడిచిన ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటును రెహ్మన్ తనకు లేదా తన భార్యకు ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి చేశారు. అయితే గణేష్ కు తిరిగి దక్షిణ సీటు ఇచ్చి.. నగర పార్టీ బాధ్యతల నుంచి గణేష్ ను తప్పించి ఆ పదవి రెహమాన్ కు ఇచ్చారు చంద్రబాబు. సీటు రాకపోవడంతో రెహమాన్ టీడీపీ అధిష్టానం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం జగన్ ని రెహమాన్ భార్య కలిశారు.

రెండు రోజుల క్రితం విశాఖకు చెందిన టీడీపీ నేతలు సమావేశమయ్యారు. రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేసారు. పార్టీ తీరు ఎలా ఉన్నా..తాము మాత్రం పరిపాలనా రాజధాని విశాఖలో రావటాన్ని స్వాగతించారు. ఆ సమయంలో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలతో పాటుగా కొందరు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి రెహమాన్ సైతం హాజరయ్యారు. ఎన్సార్సీ విషయంలో కేంద్రానికి టీడీపీ మద్దతివ్వటం.. అదే విధంగా విశాఖ రాజధానికి వ్యతిరేకంగా పార్టీ వైఖరి ఉండటంతో రాజీనామా చేస్తున్నట్లు రెహమాన్ ప్రకటించారు. పార్టీ ఇదే వైఖరితో ఉంటే మరికొంత మంది విశాఖ టీడీపీ నేతలు పార్టీ వీడటానికి సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

రెహమాన్ కామెంట్స్:
* విశాఖ టీడీపీలో మూడు రాజధానుల చిచ్చు
* పార్టీకి, విశాఖ అర్బన్ అధ్యక్ష పదవికి రెహమాన్ రాజీనామా
* మూడు రాజధానులను వ్యతిరేకించాలని చంద్రబాబు ఆదేశించారు
* విశాఖకు రాజధాని వస్తుంటే మేమెందుకు వ్యతిరేకించాలి
* విశాఖకు రాజధాని వస్తే మరింత అభివృద్ధి చెందుతుంది
* విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ స్వాగతించాలని జిల్లా నేతలంతా తీర్మానం చేశాం
* CAA, NRC బిల్లుపై చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయడం లేదు
* లోకేష్ తీరుపైనా రెహమాన్ విమర్శలు

Also Read : తూఛ్..నేనిక్కడే ఉన్నాను : కనిపించట్లేదని పోలీస్ ఫిర్యాదు లేంటి? : వైసీపీ ఎమ్మెల్యే