TTD : బీహార్‌లో శ్రీవారి ఆలయం.. 15 ఎకరాల భూమి కేటాయింపు

TTD : బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మించేందుకు బీహార్ ప్రభుత్వం అంగీకరించింది. శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15 ఎకరాల భూమిని కేటాయించింది.

TTD Chairman BR Naidu met Deputy CM Samrat Choudhary and expressed his gratitude

TTD : బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మించేందుకు బీహార్ ప్రభుత్వం అంగీకరించింది. శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15 ఎకరాల భూమిని కేటాయించింది. పాట్నా సమీపంలో గంగా తీరాన శ్రీవారి దివ్యాలయం నిర్మాణం కానుంది. ఈ సందర్భంగా టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త దొరస్వామితో కలిసి బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారికి శ్రీవారి జ్ఞాపికను అందజేసి, శాలువాతో సత్కరించారు. తాజాగా పరిణామంతో ఉత్తర భారతదేశంలో సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ మరో ముందడుగు వేసింది.

Also Read : Janasena : జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఓపెనింగ్.. ఎప్పుడు? ఎక్కడ? ఫుల్ డీటెయిల్స్..

దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో టీటీడీ ధర్మకర్తల మండలితోపాటు ఈవో, అదనపు ఈవోలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అప్పటికే అస్సాం రాష్ట్రంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి పది ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. అమెరిగోగ్‌లోని సదరు భూమిని టీటీడీ పేరున గత వారం క్రితం రిజిస్ట్రేషన్ అయింది.

బీహార్ రాష్ట్రంలో పాట్నాకు సమీపంలో, గంగా నది తీరానికి దగ్గరగా, జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇక్కడ స్వామివారి ప్రధాన ఆలయంతోపాటు అత్యంత వైభవంగా కల్యాణ మండపం, పవిత్రమైన పుష్కరిణిని ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ ఆలయం నిర్మితమైతే, అది హిందూ ధర్మ పరిరక్షణకు, సనాతన సంస్కృతి విస్తరణకు ఒక ప్రముఖ కేంద్రంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భక్తుల సౌకర్యార్థం ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.