Janasena : జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఓపెనింగ్.. ఎప్పుడు? ఎక్కడ? ఫుల్ డీటెయిల్స్..
తెలంగాణ ప్రజలకు జనసేన మరింత చేరువ కావటానికి తెలంగాణలో జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. (Janasena)
Janasena
Janasena : పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్లుగా తెలంగాణలో కూడా జనసేన పార్టీని పటిష్ష్టం చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో జనసేన తెలంగాణలో కూడా పోటీ చేస్తుందని ఇటీవల అధికారికంగానే ప్రకటించారు పవన్. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు జనసేన మరింత చేరువ కావటానికి తెలంగాణలో జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ మణికొండ సమీపంలోని మల్కంచెరువు వద్ద జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని జూన్ 19న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రారంభించనున్నారు. జూన్ 19న ఉదయం 11:08 గంటలకు నూతన పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ పూజ కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు.
Also Read : Pawan Kalyan: రేపు వరంగల్ కు పవన్ కళ్యాణ్.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని
తెలంగాణలో పార్టీ విస్తరణకు నూతన కార్యాలయంతో శ్రీకారం చుట్టారు పవన్. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు, వీరమహిళలు, నాయకులకు ఆహ్వానం అందించారు. ఆ రోజు భారీగా జనసైనికులు హైదరాబాద్ కి తరలిరానున్నారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన కార్యకలాపాలకు నూతన కార్యాలయం కేంద్రంగా మారనుంది.
