Rajahmundry Pushkar Ghat: రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. పుష్కర ఘాట్ గోదావరి నది మధ్యలో బోటు బోల్తా పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. 20 మంది కోటిలింగాల ఘాట్ నుంచి బయలుదేరి బ్రిడ్జ్ లంకకు వెళ్లారు. అయితే, పడవలోకి నీరు చేరడంతో 8మందిని ఒడ్డున దింపేశారు.
మరో 12 మందిని తీసుకుని వస్తుండగా.. బ్రిడ్జ్ 7వ వంతెన దగ్గర గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు జాలర్ల సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో బోటు నడిపే మత్స్యకారుడు కూడా ఉన్నాడు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన వారు రాజమండ్రి శివారు సింహాచల్ నగర్, భవానీ పురం ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.
Also Read : ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే? సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ..
రాత్రి 8 గంటల సమయంలో గోదావరి మధ్యలో ఇసుక తిన్నెల్లో మద్యం సేవించేందుకు సుమారు 20 మంది యువకులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆ 20 మంది యువకుల్లో మొదట 8 మంది పడవలో ఒడ్డుకు చేరుకున్నారు. మరో 12మందితో పడవ తిరిగి వస్తుండగా.. బ్రిడ్జి దగ్గర 7పిల్లర్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది.
ఆ సమయంలో బోటులో 12 మంది ఉన్నారు. అందులో 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. రాత్రి సమయం కావడంతో బోటు పిల్లర్లకు తగలడం, బోటు లోపలికి నీరు చేరి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు.