టీడీపీ దాడులపై వైసీపీ కౌంటర్.. ఏం చేయబోతున్నారో చెప్పిన బొత్స
"ఇళ్లపై దాడులేంటి? నిప్పులు పెట్టడం ఏంటి? పెట్రోల్ బాంబులు వేయడం ఏంటి? ఏపీలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి చూశామా?" అని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : February 2, 2026 / 03:04 PM IST
Botsa Satyanarayana (Image Credit To Original Source)
- ఇలాంటి పరిణామాలను ఎప్పుడూ చూడలేదు
- రాష్ట్రాన్ని చంద్రబాబు బిహార్‌లా చేసేస్తున్నారు
- ఏపీని అప్రతిష్ఠ పాలు చెయ్యవద్దు
Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఇవాళ తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
“ఇలాంటి పరిణామాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జాతీయ స్థాయిలో తీసుకుని వెళ్తాం. రేపు జగన్‌తో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరం. ఇళ్లపై దాడులేంటి? నిప్పులు పెట్టడం ఏంటి? పెట్రోల్ బాంబులు వేయడం ఏంటి? ఏపీలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి చూశామా?
Also Read: రాహుల్ మాట్లాడుతుండగా మైక్ కట్.. లోక్‌సభలో గందరగోళం.. ఏమైందంటే?
డీజీపీ పోలీస్ పని చేస్తున్నారా? చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తున్నారా? అంబటి రాంబాబుపై దాడి చేసి విచక్షణా రహితంగా తిట్టారు. ఆవేదనలో అంబటి మాట జారారు. రాంబాబు వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.. అయినా ఇంటిపై దాడి చేశారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని బిహార్‌లా చేసేస్తున్నారు. ఏపీకి మంచి పేరు ఉంది. అప్రదిష్ఠ పాలు చెయ్యవద్దు. తిరుపతి లడ్డూ కేసు వ్యవహారంలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది.. వ్యవస్థలను నమ్మరా..? రాష్ట్రంలో వాల్ పోస్టర్స్ ఏంటి..? రాష్ట్రాన్ని రావణకాష్టం చేద్దామని అనుకుంటున్నారా?” అని అన్నారు.
