నీ శీలం పోయింది.. చచ్చిపో.. : బాలికకు విషం ఇచ్చిన ప్రియుడు

పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురంలో దారుణం జరిగింది. కామాంధుడి అకృత్యానికి బలైన ఓ బాలిక.. ప్రియుడి వేధింపులతో మరింత ఆవేదనకు గురైంది. మాటలతో వేధించడమే

  • Publish Date - December 17, 2019 / 10:02 AM IST

పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురంలో దారుణం జరిగింది. కామాంధుడి అకృత్యానికి బలైన ఓ బాలిక.. ప్రియుడి వేధింపులతో మరింత ఆవేదనకు గురైంది. మాటలతో వేధించడమే

పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురంలో దారుణం జరిగింది. కామాంధుడి అకృత్యానికి బలైన ఓ బాలిక.. ప్రియుడి వేధింపులతో మరింత ఆవేదనకు గురైంది. మాటలతో వేధించడమే కాదు.. చచ్చిపో అంటూ ఆత్మహత్యకు ప్రేరేపించాడు. అక్కడితో ఆగక కూల్‌ డ్రింక్‌లో విషం కలిపి ఆమెతో తాగించాడు. ఆ కూల్ డ్రింక్ తాగిన బాలిక.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం(డిసెంబర్ 13,2019) కన్నుమూసింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురానికి చెందిన 14 ఏళ్ల బాలిక అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యంతో ప్రేమలో ఉంది. 9వ తరగతి చదువుతున్న ఆ బాలిక.. ఇటీవల గుడిలో భజన కార్యక్రమానికి హాజరైంది. రాత్రిపూట ఒంటరిగా ఇంటికి బయలుదేరింది. దారిలో.. అదే గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి బాలికను అడ్డుకున్నాడు. నిర్మానుష్య ప్రాంతంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పారిపోయాడు. ఇంటికి చేరుకున్న బాలిక.. విషయం ఎవరికి చెప్పాలో తెలియక తనలో తానే కుమిలిపోయింది. చివరికి తన ప్రియుడు సుబ్రహ్మణ్యంతో విషయం చెప్పింది. అతడు ఓదారుస్తాడని భావించింది. కానీ.. సీన్ రివర్స్ అయ్యింది. బాధలో ఉన్న బాలికను సుబ్రహ్మణ్యం మరింత వేధించాడు. సూటిపోటి మాటలతో టార్చర్ పెట్టాడు.

”నీ శీలం చెడిపోయింది.. ఇక నువ్వు బతికి లాభం లేదు.. చచ్చిపో..” అంటూ బాలికను అవమానించాడు. అంతేకాదు.. డిసెంబర్ 9న కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి బాలికతో తాగించాడు. అది తాగి స్కూల్‌కి వెళ్లిన ఆమె.. అక్కడ నురగులు కక్కుతూ కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి బాలికను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో చింతలపూడి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాజు, సుబ్రహ్మణ్యంలపై కేసు నమోదు చేశారు.

కాగా, బాలికతో నీచంగా ప్రవర్తించి ఆమె మృతికి కారణమైన సుబ్రహ్మణ్యం తీరుపై అంతా మండిపడుతున్నారు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన వాడే ప్రాణం పోవడానికి కారణం అయ్యాడని మండిపడుతున్నారు. సుబ్రహ్మణ్యంని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.