Andhrapradesh : ఏపీలో దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తను చంపేసి.. పెరట్లో పాతిపెట్టిన భార్య.. ఆ ఒక్క తప్పుతో దొరికిపోయింది..
Andhrapradesh : ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపేసింది.
- Harishth Thanniru
- Published On : March 28, 2026 / 08:11 AM IST
brutal incident in Andhrapradesh
- అనంతపురం జిల్లాలో దారుణ ఘటన
- వివాహేతర సబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్య
- మూడు నెలల క్రితం ఘటన.. తాజాగా వెలుగులోకి
Andhrapradesh : ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపేసింది. రోకలి బండతో కొట్టి హత్యచేసిన తరువాత.. ఇంటి పెరట్లోనే భర్త మృతదేహాన్ని పాతిపెట్టింది.. మూడు నెలల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా.. తాజాగా.. మహిళ కుమార్తె ఇచ్చిన సమాచారంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామంకు చెందిన హనుమంతరాయుడు (43), కల్యాణ దుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన సుకన్యకు 18ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వీరికి కుమార్తె అమృత, కుమారుడు సందీప్ ఉన్నారు. 15ఏళ్లుగా కల్యాణదుర్గం మండలం పాతచెరువులో ఉంటూ గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సుకన్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని.. అతన్ని చంపేయాలని సునక్య భావించింది. మూడు నెలల క్రితం రోకలి బండతోకొట్టి భర్తను హత్యచేసిన సుకన్య.. అతని మృతదేహాన్ని ఇంటిలోని పెరట్లోనే పాతిపెట్టింది.
కొద్దిరోజుల తరువాత ఇంటర్ చదువుతున్న కుమార్తె అమృతకు తల్లి చేసిన దారుణ ఘటన గురించి తెలిసింది. దీంతో తల్లిని నిలదీయడంతో బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించింది. అయితే, శుక్రవారం తల్లీకుమార్తె మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో కుమార్తెను సైతం హత్యచేసేందుకు సుకన్య ప్రయత్నించడంతో.. అమృత అక్కడి నుంచి తప్పించుకొని తన తండ్రి స్వగ్రామం హనిమిరెడ్డిపల్లికి వెళ్లింది.
తండ్రి తరపున బంధువులకు అమృత అసలు విషయం చెప్పింది. దీంతో హనుమంతరాయుడు తరపున బంధువులు పాతచెరువుకు చేరుకునేలోగా.. నిందితురాలు సుకన్య కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
