Visakhapatnam : పక్కా ప్లాన్ ప్రకారమే.. విశాఖలో యువతి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

brutal incident in Visakhapatnam : ముందస్తు ప్లాన్ ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో మౌనికను రవీంద్ర విశాఖలోని తన ప్లాటుకు రావాలని పిలిచాడు. ఆమె వచ్చిన కొద్దిసేపటికే మౌనికను గోడకు కొట్టి హత్య చేశాడు.

brutal incident in Visakhapatnam

  • ప్రియురాలిని హత్యచేసి ముక్కలుగా చేసి..
  • విశాఖపట్టణంలో దారుణ ఘటన
  • పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి

Visakhapatnam : ఏపీలోని విశాఖపట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో తన ప్రియురాలిని ఇంటికి పిలిచి ఓ వ్యక్తి దారుణ హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి ఫ్రిజ్ లో పెట్టాడు. ఈ ఘటనలో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Also Read : Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఆ సమయాల్లో బయటకు రావొద్దంటూ..

విశాఖపట్టణం జిల్లా గాజువాక పరిధిలోని కైలాసపురం ప్రాంతానికి చెందిన రవీంద్ర ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాప్ట్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన వివాహితురాలు మౌనిక (28)తో అతనికి పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా మౌనికతో రవీంద్రకు పరిచయం ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే, రవీంద్రకు కొద్దికాలం క్రితం మరో యువతితో పెళ్లయింది. విశాఖలోని ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నాడు. భార్య గర్భిణీ కావడంతో పుట్టింటికి వెళ్లింది. ఆదివారం రాత్రి తన ప్రియురాలు మౌనికను ఇంటికి పిలిచిన రవీంద్ర.. ఆమెను హత్యచేశాడు. శరీర భాగాలను రెండు ముక్కలుగా చేసి ఫ్రీజులో పెట్టాడు. ఆ తరువాత పోలీస్టే షన్ కు వెళ్లి లొంగిపోయాడు. అయితే, పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

మౌనికతో రవీంద్రకు మూడేళ్లుగా పరిచయం ఉందని పోలీసుల విచారణలో తేలింది. వేరే మహిళతో రవీంధ్రకు వివాహం జరిగినప్పటి నుంచి తనను పెళ్లి చేసుకోవాలని మౌనిక రవీంధ్రపై ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలిసింది. అంతేకాక.. ఆర్థికంగా కూడా సహాయం చేయాలని మౌనిక ఒత్తిడి చేస్తుండేదని, ఇటీవల మౌనిక ఆరోగ్యం కూడా బాగాలేకపోవటంతో తరచూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండేదని పోలీసుల విచారణలో రవీంధ్ర తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మౌనికను అడ్డు తొలగించుకోవాలని రవీంద్ర భావించినట్లు తెలుస్తోంది.

ముందస్తు ప్లాన్ ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో మౌనికను రవీంద్ర విశాఖలోని తన ప్లాటుకు రావాలని పిలిచాడు. ఆమె వచ్చిన కొద్దిసేపటికే మౌనికను గోడకు కొట్టి హత్య చేశాడు. హత్య తరువాత శ్రీకాకుళంలో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. అప్పటికే తల, కాళ్లు, చెప్పులు, మౌనిక సిమ్ కార్డును సూట్ కేసులో పెట్టి దారపాలెం ప్రాంతంలో రవీంధ్ర దహనం చేశాడు. మౌనిక శరీర భాగాలను రెండు ముక్కలుగా చేసి కవర్లలో పెట్టి ఇంట్లోని ఫ్రీజులో పెట్టాడు. అయితే, తన స్నేహితుడు పోలీసులకు లొంగిపోవాలని సూచించడంతో రవీంద్ర పోలీస్ స్టేషన్ కువెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖపట్టణంలోని రవీంధ్ర ప్లాట్ కు వెళ్లి అక్కడ పరిస్థితిని పోలీసులు తనిఖీ చేశారు. ఫ్రీజులో మృతదేహం భాగాలను స్వాధీనం చేసుకున్నారు. రవీంద్ర నుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు.