Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేశ్‌పై కేసు నమోదు
నిన్నటి ఘర్షణతో ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రతను పెంచారు.
- T Venkateshwarlu
- Updated on- February 2, 2026 / 11:16 AM IST
Jogi Ramesh (Image Credit To Original Source)
- చంద్రబాబు, లోకేశ్‌పై అభ్యంతరకర కామెంట్స్
- ఇబ్రహీంపట్నం పీఎస్‌లో కేసు నమోదు
- జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత పెంపు
Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేశ్‌పై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్‌లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, మీడియా సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్నటి ఘర్షణతో ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రతను పెంచారు.
Also Read: కుప్పకూలిపోయిన పసిడి ధర, ఏకంగా రూ.50 వేలు తగ్గిన వెండి రేటు.. లక్కీ ఛాన్సులే..
కాగా, చంద్రబాబు, లోకేశ్‌పై జోగి రమేశ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో నిన్న సాయంత్రం ఇబ్రహీంపట్నంలోని జోగి ఇంటిని ముట్టడించిన విషయం తెలిసిందే. ఆయన ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలను చింపేసి, రాళ్లు విసిరారు. జోగి రమేశ్ ఇంటికి నిప్పటించారు. దీంతో నిన్న సాయంత్రం ఆయన ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ సమయంలో జోగి రమేశ్ ఇంట్లో లేరు.
జగన్ ఫైర్
జోగి రమేశ్ ఇంటిపై దాడి ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ విషయంలో సీబీఐ రిపోర్టు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఎక్స్‌లో చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు.
“ప్రజాస్వామ్యంలో మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబులు NDDB, NDRI నిర్ధారించాయి. మీరు చేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే, జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం మీ భ్రమే చంద్రబాబు. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి” అంటూ ట్వీట్ చేశారు.
