Andhra Pradesh
Andhra Pradesh: కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామంలో ఇటీవల మట్టి మాఫియా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) అరవింద్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. రాత్రిపూట అక్రమంగా మట్టి తరలిస్తుండగా, ఆర్ఐ అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో మట్టి మాఫియా ఆర్ఐపై దాడికి దిగింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆర్ఐ పైనే కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఆర్ఐతోపాటు, రెవెన్యూ సిబ్బంది లంచం డిమాండ్ చేస్తూ, తమపై దాడికి దిగారని మట్టి మాఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్ఐ అరవింద్‌పై సెక్షన్ 323, 506, 384, 511 కింద గుడివాడ రూరల్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఆర్ఐపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిపై దాడి చేసిన ఘటనలో ప్రధాన సూత్రధారి గంటా సురేష్‌ను మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం విశేషం. మట్టి మాఫియాను ఎదిరించి, ఆ మాఫియా చేతిలోనే దాడికి గురైన ఆర్ఐపేనే కేసు నమోదు చేయడంతో రెవెన్యూ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.