YS Jagan Bail : YS జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ తీర్పు సెప్టెంబర్ 15కు వాయిదా

ఆస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు తీర్పును సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది.

ys jagan bail cancellation petition  : ఆస్తుల కేసులో ఏపీ సీఎంజగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పు మరోసారి వాయిదా వేసింది. సీఎం జగన్ కు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈరోజు విచారణ కొనసాగిన క్రమంలో సీబీఐ కోర్టు తీర్పును సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది. అలాగే వైసీపీ ఎంప విజయసాయిరెడ్డి పిటిషన్‌పై కూడా వాదనలు జరుగగా ఎంపీ రద్దు పిటీషన్ పై తీర్పు కూడా సెప్టెంబర్ 15న తీర్పు వెల్లడిస్తామని కోర్టు వెల్లడించింది. అటు సీఎం జగన్, ఇటు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్లను 15కు వాయిదా వేసిన ధర్మాసనం తీర్పు ఒకేసారి ప్రకటిస్తామని తెలిపింది. దీంతో సీఎం జగన్ కు , ఎంపీ విజయసాయి రెడ్డిలకు కాస్త ఊరట లభించినట్లు అయ్యింది.

కాగా సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ అర్హతపై కోర్టులో వాదనలు జరిగాయి.. తర్వాత కోర్టు విచారణకు స్వీకరించింది. సీఎం వైఎస్ జగన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జ్ షీట్లను సీబీఐ నమోదు చేసిందని ఎంపీ రఘురామ పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘురామ జగన్‌పై నమోదైన కేసులను త్వరగా విచారణ పూర్తి చేయాలని ఎంపీ రఘురామ కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే సీఎం జగన్ తరపు న్యాయవాదులు, పిటిషనర్ రఘురామకృష్ణం రాజు లాయర్లు లిఖితపూర్వకంగా..తమ వాదనలు కోర్టుకు సమర్పించారు.

కాగా..గతంలో సీఎం జగన్ పిటిషనర్ తరపు న్యాయవాదులు రిజైండర్ వేసినప్పటికీ సీబీఐ అధికారులు మాత్రం కేవలం కోర్టుకు విచక్షణ అధికారం వదిలేస్తున్నామని.. బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే అంశానికి సంబంధించి న్యాయపరమైన చర్యలు ధర్మాసనమే తీసుకోవాలని రిజైండర్‌లో పేర్కొన్నారు. అదే విషయాన్ని ఆన్ రికార్డుల్లోకి తీసుకోవాలని సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. ఈ క్రమంలో ఈరోజు కూడా వాదనలు కొనసాగగా..ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు బెయిల్ రద్దు పిటీషన్ ను సెప్టెంబర్‌ 15కు వాయిదా వేసింది.

ట్రెండింగ్ వార్తలు