Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం.. చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ

ఇప్పటికే చంద్రబాబు తరుపు అడ్వకేట్ల వాదనలు పూర్తి అయ్యాయి. సీఐడీ తరుపున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు.

Chandrababu Bail petition (2)

Chandrababu Bail Petition : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరుగనుంది. చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఆయన రెగ్యులర్ బెయిల్ పై హైకోర్టులో విచారణ కొనసాగనుంది.  ఇప్పటికే చంద్రబాబు తరుపు అడ్వకేట్ల వాదనలు పూర్తి అయ్యాయి.

సీఐడీ తరుపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. నిన్నటి విచారణలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దవి సీఐడీ అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. కాగా, చంద్రబాబు హెల్త్ గ్రౌండ్స్ పై మెడికల్ రిపోర్ట్స్ తో మెమోను చంద్ర బాబు తరుపు అడ్వకేట్స్ హైకోర్టుకు సమర్పించారు.