అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికల్లో గెలవండి….ఇక మేం మాట్లాడం

  • Publish Date - August 3, 2020 / 06:28 PM IST

అసెంబ్లీని రద్దు చేసి రావాలని, ప్రజల్లో తేల్చుకుందామని ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. ఏపీ రాజధాని వికేంద్రీకరణపై ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రాజధాని గురించి చెప్పకుండా ప్రజలను మధ్యపెట్టారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు చేస్తామనడం సమంజసం కాదన్నారు.



ఏపీ రాష్ట్ర ప్రజల భవిష్యత్ నాశనం చేసే అధికారం ఎవరికీ లేదని చంద్రబాబు అన్నారు. రాజధాని సమస్య ఏ ఒక్కరిదో కాదని, ఐదు కోట్ల మంది ప్రజలదన్నారు. జగన్ ఎలా మోసం చేశారో ఐదు కోట్ల మంది ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు సరైన నిర్ణయమని భావిస్తే అందరం రాజీనామాలు చేసి ప్రజల వద్దకు వెళ్దామని చెప్పారు. 48 గంటలు సమయం ఇస్తున్నా అసెంబ్లీని రద్దు చేయండి…రాజీనామాలు చేయడానికి టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

‘మీరు రాజీనామాలు చేసి రండి ప్రజల్లో తేల్చుకుందాం.. ప్రజా తీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా ఉంటే స్వాగితిస్తాం… నా సవాల్ ను స్వీకరిస్తారా..ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా’.. అని చంద్రబాబు ప్రశ్నించారు. రెండు రోజుల్లో స్పందించకపోతే మళ్లీ మీడియా ముందుకు వస్తానని పేర్కొన్నారు.