Roja Selvamani : తొందరలోనే చంద్రబాబు, లోకేశ్ జైలుకెళ్తారు.. పురంధేశ్వరి ఎందుకు మాట్లాడరు?- మంత్రి రోజా హైఓల్టేజ్ కామెంట్స్
చంద్రబాబుతో కలిసి దోచుకున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఆల్రెడీ జైలుకెళ్లాడు. ఇక, ఈ అమరావతిలో దోచుకున్న చంద్రబాబు కూడా తొందరలోనే కొడుకుతో సహా జైలుకెళ్లడం ఖాయం. Roja Selvamani - Chandrababu Naidu
- Naveen
- Updated on- September 6, 2023 / 10:43 PM IST
Roja Selvamani - Chandrababu Naidu (Photo : Facebook, Google)
Roja Selvamani – Chandrababu Naidu : ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కి చేరింది. చంద్రబాబు టార్గెట్ గా వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఛాన్స్ చిక్కితే చాలు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇక, పదే పదే.. చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం అని చెబుతున్నారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ జైలుకెళ్తారని నమ్మకంగా చెబుతున్నారు.
చంద్రబాబు పేరు వింటే చాలు అంతెత్తున ఎగిరిపడే ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా.. మరోసారి హైఓల్టేజ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ ఇద్దరూ జైలుకెళ్తారని మంత్రి రోజా బాంబు పేల్చారు. అవినీతిని ప్రశ్నించే పవన్ కల్యాణ్.. చంద్రబాబు విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారామె. బీజేపీ చీఫ్ గా పురంధేశ్వరి కూడా మాట్లాడకుండా ఉండటం సరికాదన్నారు మంత్రి రోజా. త్వరలోనే చంద్రబాబు, లోకేశ్ జైలుకెళ్లడం ఖాయం అన్నారు మంత్రి రోజా.
Also Read..Chandrababu: నన్ను అరెస్టు చేస్తారేమో..! టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
”చంద్రబాబు, లోకేశ్ తోడు దొంగలు. దోచుకున్నది హైదరాబాద్ లోని తమ ఇంట్లో దాచుకున్నారు. అందుకే తేలు కుట్టిన దొంగలలాగా ఉన్నారు. ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టా అని చెప్పే పవన్ కల్యాణ్.. ఎందుకు ప్రశ్నించడం లేదు? బీజేపీ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎందుకు మాట్లాడటం లేదో అని ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ అనుమానంగా ఉంది. పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలా? లేక బాబు జనతా పార్టీ అధ్యక్షురాలా? అని ప్రజలంతా డౌట్ పడుతున్నారు.
అవినీతి అమరావతిలో చంద్రబాబు దోచుకున్నది దాదాపుగా 2వేల కోట్లకు పైగానే 2020లోనే చెప్పారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ జైలుకి వెళ్లే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. చంద్రబాబుతో కలిసి దోచుకున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఆల్రెడీ జైలుకెళ్లాడు. ఇక, ఈ అమరావతిలో దోచుకున్న చంద్రబాబు కూడా తొందరలోనే కొడుకుతో సహా జైలుకెళ్లడం ఖాయం” అని మంత్రి రోజా హాట్ కామెంట్స్ చేశారు.
