×
Ad

చంద్రబాబు, పవన్‌ భేటీపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్.. ఆ సీట్ల సర్దుబాటుపై ఓ క్లారిటీకి వచ్చారా?

చింతకాయల విజయ్, కిలారు రాజేష్‌లో ఎవరినో ఒకరిని పెద్దల సభకు పంపి అవకాశం ఉందంటున్నారు.

Chandrababu Naidu and Pawan Kalyan

  • కీలక పరిణామాల వేళ ఆ ఇద్దరి భేటీపై చర్చ
  • కల్తీ నెయ్యి ఎపిసోడ్, రాజ్యసభ సీట్లపై డిస్కషన్?
  • బీజేపీ పెద్దలతో చర్చించిన అంశాలపై పవన్‌ వివరించారా?

Chandrababu Naidu: పొలిటికల్ సిచ్యువేషన్స్ మారుతున్నాయ్. రోజురోజుకు ఏపీ రాజకీయం రంజుగా మారుతోంది. ఓ వైపు కల్తీ నెయ్యి ఇష్యూ, మరోవైపు జనసేన ఎమ్మెల్యే వ్యవహారం..ఇంతలోనే పవన్ ఢిల్లీ టూర్..త్వరలో రాబోయే రాజ్యసభ ఎన్నికలు..ఇలా కీలక డెవలప్‌మెంట్స్‌ వేళ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ భేటీ ఆసక్తికర చర్చకు దారి తీసింది.

ప్రత్యేకంగా కూటమిలోని మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ఇకపై కలిసికట్టుగా కార్యక్రమాలు చేపట్టేలా చంద్రబాబు, పవన్ ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరిపాలనతో పాటు రాజకీయంగా కూడా కూటమిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే వాళ్లిద్దరి భేటీ ఔట్‌ పుట్‌ అంటున్నారు.

సేమ్‌టైమ్‌ ఈ మధ్యే ఢిల్లీ టూర్‌కు వెళ్లి వచ్చారు పవన్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి..పలు అంశాలపై డిస్కస్ చేశారు. అభివృద్ధి, నిధులు కోసం రిక్వెస్ట్ చేసినా..రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో భేటీలో పవన్‌ ఢిల్లీ టూర్‌.. బీజేపీ పెద్దలతో డిస్కస్ చేసిన అంశాలపై చర్చ జరిగిందట.

Also Read: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన.. ప్రచారానికి పవన్ సిద్ధం.. ఇక ఏం జరగబోతుంది?

కల్తీ నెయ్యి ఎపిసోడ్‌లో లేటెస్ట్‌గా సిట్‌ ఇచ్చిన రిపోర్ట్‌ను బేస్‌ చేసుకుని వైసీపీ చేస్తున్న ఎదురుదాడి..జనసేన ఎమ్మెల్యే ఇష్యూ..అంబటి ఎపిసోడ్‌..ఇలా అన్ని అంశాలపై డిస్కస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా ఉన్న మరో మరో అంశం..రాజ్యసభ ఖాళీలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరో మూడు నాలుగు నెలల్లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి.

జూన్ నెలలో వీరి పదవీ విరమణ
వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ జూన్ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ పదవీకాలం కూడా ముగియనుంది. దీంతో పెద్దల సభకు ఎవరు వెళ్లబోతున్నారు..ఆ నాలుగు సీట్లను కూటమి పార్టీలు ఎలా పంచుకోబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్‌గా ఎపిసోడ్‌గా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సార్లు జరిగిన రాజ్యసభ ఉపఎన్నికల్లో టీడీపీ, బీజేపీ చెరో రెండు సీట్లు దక్కించుకున్నాయి.

కీలక భాగస్వామిగా ఉన్న జనసేనకు ఇప్పటివరకు పెద్దల సభలో ప్రాతినిధ్యం లభించలేదు. ఈసారి జనసేనకు ఒక రాజ్యసభ సీటు ఖాయం అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన తరఫున లింగమనేని రమేష్ పేరు బలంగా వినిపిస్తుండగా, తన అన్నయ్య మెగాస్టార్‌ను రాజ్యసభకు పంపితే ఎలా ఉంటుందనే దానిపై సన్నిహితులతో చర్చిస్తున్నారట పవన్.

ఇక టీడీపీలో రాజ్యసభ రాజ్యసభ బెర్త్ కోసం పది మంది వరకు వెయిట్ చేస్తున్నారు. గల్లా జయదేవ్, దేవినేని ఉమా, పిఠాపురం వర్మ, జవహర్‌తో పాటు వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్‌రావు, టీడీ జనార్ధన్, కనకమేడల రవీంద్రకుమార్, రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి వంటి పేర్లు రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఎవరికెన్నీ సీట్లు?
అయితే జనసేనకు ఒకటి పోను.. టీడీపీకి రెండు సీట్లు తీసుకుని ఒకటి సానా సతీష్‌కు రీన్యూవల్ చేయాలని డిసైడ్ అయ్యిందట. మరొక సీటు రేసులో ఇప్పటికే ఉన్న ఆశావహులకు తోడుగా మరో ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయట. చింతకాయల విజయ్, కిలారు రాజేష్‌లో ఎవరినో ఒకరిని పెద్దల సభకు పంపి అవకాశం ఉందంటున్నారు.

లోకేశ్ యువగళం పాదయాత్రలో కీలక పాత్ర పోషించిన కిలారు రాజేష్‌, గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయాలనుకుని సీటు త్యాగం చేసిన చింతకాయల విజయ్‌.. లోకేశ్‌కు సన్నిహితులుగా ఉన్నారు. దీంతో ఈ ఇద్దరి పేర్లు రాజ్యసభ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. మిగిలిన వారిని శాసన మండలి రేసులో సర్దుబాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ అంశాలపై సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ భేటీలో చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ రేసు మరింత రసవత్తరంగా మారింది. కూటమి సమీకరణలు, టీడీపీ, జనసేనకు దక్కే సీట్లు, టీడీపీలో ఎవరి అదృష్టం వరించబోతుందనేది..త్వరలోనే క్లారిటీ రానుంది.