Chandrababu Naidu: 2024 సంవత్సరంలో మీరు ఇచ్చిన తీర్పుతో ఈ పనులన్నీ చేశాం: చంద్రబాబు
తెలుగు ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
- T Venkateshwarlu
- Published On : December 31, 2024 / 09:10 PM IST
N Chandrababu Naidu
తెలుగు ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఈ నూతన ఏడాది ప్రజలకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.
“2024 సంవత్సరంలో మీరు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మీ మంచి ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పని చేస్తోంది. కేవలం ఆరునెలల్లోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలను ఆవిష్కృతం చేశాం. నిరుపేద భవిష్యత్‌కు భరోసా ఇస్తూ పింఛన్ల మొత్తాన్ని పెంచాం. ప్రతి ఇంటా కట్టెల పొయ్యి కష్టాలు తీరుస్తూ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం.
ధాన్యం సేకరణ డబ్బులు 48 గంటల్లో చెల్లించి రైతన్నలో సంతోషాన్ని నింపాం. మీ ప్రయాణం సాఫీగా సాగాలని రాష్ట్రంలో రహదారులన్నీ గుంతలు లేకుండా చేస్తున్నాం. కొత్త ప్రభుత్వ పాలసీలతో మళ్లీ పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నాంది పలికాం.
కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోంది. ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్ సాకారమే లక్ష్యంగా పది సూత్రాల ప్రణాళిక అమలు చేస్తూ అటు ప్రజా సంక్షేమాన్ని, ఇటు రాష్ట్రాభివృద్ధిని మీ అందరి సహకారంతో చేసి చూపిస్తాం. మీ అందరికీ మరోసారి హ్యాపీ న్యూఇయర్ 2025” అని చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగు ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025లో మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నాను. 2024 సంవత్సరంలో మీరు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మీ మంచి ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పని చేస్తోంది. కేవలం ఆరునెలల్లోనే సంక్షేమం,… pic.twitter.com/78e8c6uT6Y
— N Chandrababu Naidu (@ncbn) December 31, 2024
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజలకు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త ఏడాది ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. 2025లో ప్రతి ఇంట్లో ఆనందం నింపాలని, ఆరోగ్యం అందించాలని అన్నారు.
