YouTuber Ravan : రావణ్ కేసులో కీలక మలుపు.. హైకోర్టును ఆశ్రయించిన భార్య అనూష
YouTuber Ravan Wife : యూట్యూబర్ రావణ్ భార్య అనూష ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను వెనక్కి ఇప్పించేలా ఆదేశాలవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.
YouTuber Ravan Wife
YouTuber Ravan Wife : యూట్యూబర్ రావణ్ భార్య అనూష ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేశారు. తమ నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను వెనక్కి ఇప్పించాల్సిందిగా ఆమె కోర్టును కోరారు. అలాగే తన భర్తకు సంబంధించిన మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకుండా, వ్యాప్తి చేయకుండా అడ్డుకునేలా విజయవాడ సైబర్ క్రైమ్ సెల్ అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
Read Also : Botsa Satyanarayana : మత్స్యకారులకు అండగా ఉండాలి.. రావణ్‌కు న్యాయ సహాయం తప్పా? బొత్స సంచలన వ్యాఖ్యలు!
అదేవిధంగా, తమ కుటుంబ సభ్యులు, సిబ్బందిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని పిటిషన్లో కోరారు. రావణ్ ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉన్న డేటాను పోలీసులు చూడకుండా, దుర్వినియోగం చేయకుండా రక్షణ కల్పించాలని కూడా ఆమె అభ్యర్థించారు.
తమ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను మీడియా లేదా సామాజిక మాధ్యమాలకు లీక్ చేయకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును అనూష కోరారు. ప్రస్తుతం ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపాల్సి ఉంది.
