చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మే 7కి వాయిదా

Chandrababu Naidu: ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక అధికారుల పని పడతామంటూ నారా లోకేశ్ బెదిరిస్తున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మే 7కి వాయిదా పడింది. పిటిషన్ పై జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం విచారణ జరుపుతోంది. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ దాఖలు అయిందని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది రంజిత్ కుమార్ చెప్పారు.

ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక అధికారుల పని పడతామంటూ నారా లోకేశ్ బెదిరిస్తున్నారని అన్నారు. దీనిపై ఐఏ దాఖలు చేశామని కోర్టుకు రంజిత్ కుమార్ తెలిపారు. రెడ్ డైరీలో పేర్లు రాసుకుంటున్నామని, ఆయా అధికారులను సస్పెండ్ చేస్తామని లేదంటే చర్యలు తీసుకుంటామని లోకేశ్ అన్నారని న్యాయస్థానానికి రంజిత్ కుమార్ చెప్పారు.

చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. అయితే, ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించడం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ చెప్పారు. నారా లోకేశ్ వ్యాఖ్యలు చేస్తే అవి బెయిల్ షరతుల ఉల్లంఘన ఎలా అవుతుందని అన్నారు. అధికారులను లోకేశ్ బెదిరిస్తున్నారన్న విషయంపై అప్లికేషన్ లిస్ట్ చేయాలని రిజిస్ట్రార్ కి సుప్రీంకోర్టు సూచించింది.

ఆ తర్వాత లెటర్‌ గురించి తనకు తెలియదని సునీత తప్పించుకున్నారు: ఎంపీ అవినాశ్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు