Chandrababu Naidu
Chandrababu Naidu: టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ అరెస్టులను ఖండిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. ఇవాళ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
రాజకీయ వేధింపులు పెరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతల్లో మార్పు రావడంలేదని చెప్పారు. ప్రతిపక్షాలను ఓడించడానికి ప్రభుత్వ తమ పాలనను నమ్ముకోవాలని, అంతేగానీ, వైసీపీ సర్కారు మాత్రం అక్రమ అరెస్టులను నమ్ముకుంటోందని అన్నారు. రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ అరెస్టులే వైసీపీ తీరును స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.
ఇటువంటి తీరును వైసీపీ ఇకనైనా మానాలని చంద్రబాబు అన్నారు. టీడీపీ శ్రేణులను భయపెట్టి, తమదారికి తెచ్చుకోవాలనే తీరును విడనాడాలని చెప్పారు. సీఐడీ వైసీపీ వేధింపుల ఏజెన్సీనా అని నిలదీశారు. ఇప్పటికే అక్రమ కేసులపై అనేక సార్లు న్యాయస్థానాలు మొట్టికాయలు వేసిందని చెప్పారు. అయినప్పటికీ సర్కారు తీరు మారలేదని, ఇది జగన్ విషపు రాజకీయాలకు సాక్షమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ ఏ వ్యాపారమూ చేసుకోవద్దనే రీతిలో వైసీపీ తీరు ఉందని చెప్పారు.
Lakkineni Sudheer: వైఎస్సార్టీపీ ఖమ్మం అధ్యక్షుడి పదవికి, పార్టీకి లక్కినేని సుధీర్ రాజీనామా