Chandrababu Naidu : జగన్ లాంటి వారి గురించి అంబేద్కర్ ఆనాడే ఆలోచించారు – చంద్రబాబు
రాజ్యాంగం ఎంతమంచిదైనా దానిని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడ్డదిగా రుజువు చేయబడుతుందని చంద్రబాబు అన్నారు
- kunduru Vinod
- Published On : November 26, 2021 / 04:37 PM IST
Chandrababu Naidu
Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. గురువారం అర్ధరాత్రి వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదల వలన నష్టపోయిన వారి ఇళ్లకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు చంద్రబాబు. శుక్రవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదని అన్నారు. ఇక ఇదే సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు బాబు.. జగన్ మోహన్ రెడ్డివి అన్ని వట్టిమాటలని వ్యాఖ్యానించారు.
చదవండి : Chandrababu : భయపెట్టాలని చూస్తారా ? అస్సలు భయపడను – చంద్రబాబు
జగన్ వస్తే ఎదో చేస్తాడని ప్రజలు ఊహించారు కానీ ఒరిగిందేమి లేదని అన్నారు బాబు. రెండున్నరేళ్లలో కడప జిల్లాలో ఒక్క అభివృద్ధి పైనేనా చేశారా అంటూ ప్రశ్నించారు. రెండున్నరేళ్ల క్రితం తమ ప్రభుత్వం వేసిన రోడ్లు, కట్టిన భవనాలే దర్శనమిస్తున్నాయని, వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి ఎక్కడ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్‌లో అమలు కావడం లేదని అన్నారు.
చదవండి : Chandrababu Naidu Issue : వైసీపీ ఎమ్మెల్యేలకు భద్రత పెంపు
రాజ్యాంగం ఎంతమంచిదైనా దానిని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడ్డదిగా రుజువు చేయబడుతుందని.. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దానిని అమలు చేసేవారు మంచివారైతే అది మంచిదిగా రుజువవుతుందని అంబేద్కర్ చెప్పిన మాటలను చంద్రబాబు గుర్తుచేశారు. జగన్ మోహన్ రెడ్డి లాంటి వారు పాలిస్తారని అంబేద్కర్ ఆనాడే ఉహించి ఉంటారని చంద్రబాబు అన్నారు.
