Chandrababu Naidu Issue : వైసీపీ ఎమ్మెల్యేలకు భద్రత పెంపు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో నలుగురు శాసనసభ్యులకు భద్రత పెంచారు.

New Project
Chandrababu Naidu Issue : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో నలుగురు శాసనసభ్యులకు భద్రత పెంచారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబులకు భద్రత పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వీరికి ఉన్న వ్యక్తిగత సెక్యూరిటీనీ 1+1 నుంచి 4+4 చేసింది.
Also Read : Job Cheating Gang Arrest : ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాల అనంతరం చంద్రబాబు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కంటతడి పెట్టారు. ఆ ప్రెస్ మీట్ అనంతరం వైసీపీ నాయకులను టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో బెదిరించటం మొదలెట్టారు. బెదిరింపుల నేపధ్యంలో ప్రభుత్వం నాయకులకు భద్రత పెంచింది.