Job Cheating Gang Arrest : ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Job Cheating Gang Arrest : ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

Mahesh Bhagawat

Job Cheating Gang Arrest :  రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు లేవని…. ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఈ ముఠా నిరుద్యోగులను మోసం చేస్తోందని రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు.

బాధితులకు ఈ ముఠా నకిలీ జాబ్ అపాయింట్ మెంట్ లెటర్స్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వీరివద్ద అపాయింట్ మెంట్ లెటర్స్ తీసుకున్న 24 మంది బాధితుల్లో 19 మంది పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ లోనూ… 5 గురు జ్యూడీషియల్ డిపార్ట్ మెంట్ కు ఉద్యోగంలో చేరటానికి వెళ్ళారు. అవి నకిలీ లెటర్స్ అని అధికారుల తేల్చి చెప్పారు.
Also Read : ACB Raids : కర్ణాటకలో పెద్ద ఎత్తున ఏసీబీ దాడులు
మోసపోయామని గుర్తించిన బాధితులు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హయత్ నగర్, వనస్థలిపురం, మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

మద్దెలమడుగు వరకుమార్ (36), యతకుల ప్రమోద్ కుమార్( 32)వెన్ను దినకర్ రెడ్డి (44) విప్పర్తి ప్రకాష్ (50) నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 5 లక్షల 70 వేల నగదును, నకిలీ ఉద్యోగ నియామక ఉత్తర్వు పత్రాలను, 53 నకిలీ రబ్బరు స్టాంపులు, ల్యాప్‌టాప్‌లను, ప్రింటర్లు , 4 మొబైల్‌లను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.