chandrababu slams ycp: ఇలాగైతే ఏపీలోని 5 కోట్లమంది పైనా కేసులు పెట్టాలి: చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని, ఇలాగైతే ఏపీలోని 5 కోట్లమంది పైనా కేసులు పెట్టాలని ఆయన ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విమర్శించారు. చిత్తూరు జిల్లాలోని వేపనపల్లిలో ఓ ఎమ్మెల్యేను ప్రశ్నించిన విద్యార్థి జశ్వంత్‌పై కేసు పెట్టి, అరెస్టు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారు అసహనానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన చెప్పారు
- T Venkateshwarlu
- Published On : August 5, 2022 / 02:00 PM IST
Chandrababu Warning
chandrababu slams ycp: ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని, ఇలాగైతే ఏపీలోని 5 కోట్లమంది పైనా కేసులు పెట్టాలని ఆయన ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విమర్శించారు. చిత్తూరు జిల్లాలోని వేపనపల్లిలో ఓ ఎమ్మెల్యేను ప్రశ్నించిన విద్యార్థి జశ్వంత్‌పై కేసు పెట్టి, అరెస్టు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారు అసహనానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన చెప్పారు.
ఈ ఘటనపై వైసీపీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థితో పాటు అతడికి మద్దతుగా నిలిచిన వారిపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలన్నారు. పోలీసుల తీరుపై డీజీపీ దృష్టి సారించి వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అసహనానికి గురవుతోందని ఆయన విమర్శించారు. విద్యార్థులపై కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రతి కుటుంబం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆయన చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారని ఆయన అన్నారు.
China Taiwan Tension: తైవాన్‌కు వెళ్ళకుండా మమ్మల్ని అడ్డుకోలేరు: నాన్సీ ఫెలోసీ
