Chandrababu Naidu: ఏపీ గవర్నర్‌కు చంద్రబాబు లేఖ.. పోలీసులపై ఫిర్యాదు!
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
- vamsi
- Updated on- June 8, 2021 / 01:37 PM IST
Chandrababu Naidu Writes Letter To Ap Governor
Chandrababu Naidu Writes Letter to AP Governor: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఫ్రంట్‍లైన్ వారియర్స్‌ను పోలీసులు వేధిస్తున్నారని.. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఓ వర్గం పోలీసులు ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
విశాఖలో డాక్టర్ సుధాకర్ ఘటన మరవకముందే ప్రైవేట్ ఆస్పత్రి ఉద్యోగి అపర్ణను పోలీసులు అడ్డగించి, వేధించిన విషయాన్ని చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు. సామాన్య ప్రజలను కూడా పోలీసులు వేధిస్తున్నారని, తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
ఈ ఘటనపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని, రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ అమలయ్యేలా చొరవ తీసుకోవాలని లేఖలో కోరారు చంద్రబాబు.
