ఏపీలో పోలీసు టెర్రరిజం : కంట్రోల్ యువర్ సెల్ఫ్..ఆయన డీజీపీయేనా – బాబు

  • Publish Date - March 14, 2020 / 03:02 PM IST

ఏపీ రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం యదేచ్చగా నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారపక్షం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తాము కేసులకు భయపడమని చెప్పిన ఆయన…రాజ్యంగ పరిరక్షణ కోసం ఉద్యమిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలపై 2020, మార్చి 14వ తేదీ శనివారం మీడియాతో మాట్లాడారు. 

పోలీసు వ్యవస్థగా పనిచేస్తున్నారా ? :-
పోలీసులు..పోలీసు వ్యవస్థగా పనిచేస్తున్నారా సూటిగా ప్రశ్నిస్తున్నారంటూ వెల్లడించారు. 151 ఉపయోగించిన తనను అరెస్టు చేసిన వారి దగ్గరకు..సామాన్య ప్రజానీకం వచ్చే పరిస్థితి ఉందా అంటూ నిలదీశారు. కోర్టుకెళ్లిన డీజీపీ 151 చట్టం చదివించిన పరిస్థితి ఎప్పుడైనా చూశామా అన్నారు. అఫిడవిట్ వేసిన అనంతరం ఇది రైటా ? కాదా ? తప్పు ఒప్పుకున్న డీజీపీ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా అని వెల్లడించారు. ఈయన ఒక డీజీపీనా ? ఒక విశ్వసనీయత ఉందా ? అందుకే తాను పోలీసు టెర్రరిజం అంటూ వ్యాఖ్యానిస్తున్నట్లు చెప్పారు.

డీజీపీ సమాధానం చెప్పాలి :- 
రాష్ట్రం సర్వనాశనం కావడానికి వీరు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. దీనిని పరిరక్షించడానికి ఉద్యమిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు రక్షణగా నిలబడాలే కాని..భక్షకులుగా నిలబడవద్దని సూచించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి..పోతుంటాయి..కానీ లా అండ్ ఆర్డర్ మెంటేన్ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది..దీనికి సమాధానం డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు బాబు. 

స్థానిక ఎన్నికల్లో అక్రమాలు : –
స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని బాబు ఆరోపించారు. శారీరకంగా బాధ పెట్టడం, మానసిక ఆందోళన గురి చేయడం, ఆర్థిక మూలాలపై దెబ్బ తీస్తున్నారని తెలిపారు. నామినేషన్ వేసే క్రమంలో..అనేక దాడులు చేశారని, మారువేషాల్లో వెళ్లి..నామినేషన్లు వేశారని తెలిపారు. స్క్రూటీ ఏకపక్షంగా చేశారని, విత్ డ్రా చేసే సమయంలో ప్రలోభాలకు గురి చేశారని, చాలా మంది ప్రెషర్ తట్టుకోలేక..విత్ డ్రా చేసుకున్నారని తెలిపారు. 

ఉద్యమిద్దాం :-
వైసీపీ వారికి సిగ్గు లేదని, బైండోవర్ కేసులు, ఆడవారు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. చాలా మంది మానసిక ఆందోళనలు గురి చేశారని, ఈ విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు కాదు..ప్రభుత్వాన్ని చెక్ చేయకపోతే..చాలా ఎక్కువగా డ్యామేజ్ చేశారని తెలిపారు. ఉగ్రవాదులకంటే తీవ్రంగా తయారయ్యారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధైర్యంతో ముందుకు రావాలని..ఉద్యమిద్దామని తెలిపారు బాబు. 
Read More : coronavirus మరణమృదంగం : ఇటలీలో శ్మశాన వాతావరణం