సీఎం చంద్రబాబు ఢిలో ధర్మపోరాట దీక్ష విరమించించారు.
ఢిల్లీ : సీఎం చంద్రబాబు ఢిలో ధర్మపోరాట దీక్ష విరమించించారు. మాజీ ప్రధాని దేవేగౌడ.. చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8:20 వరకు దీక్ష కొనసాగింది. చంద్రబాబు దీక్షకు జాతీయ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. కేంద్రం తీరును ఎండగట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఫిభ్రవరి 12 మంగళవారం ఉదయం ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు సీఎం చంద్రబాబు బృందం పాదయాత్ర చేయనుంది. ఉదయం 10 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం కానుంది. మధ్నాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను చంద్రబాబు బృందం కలవనుంది.