Chicken Prices Hike: నాన్ వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కారణం ఏంటంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్(Chicken Prices Hike), కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.

chicken and egg prices hike in Andhra Pradesh and Telangana

  • చికెన్ ధరలు పెరిగాయి.
  • కోడిగుడ్ల ధరలు పెంపు.
  • సామాన్యులపై భారం పడింది.

Chicken Prices Hike: తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. గత కొన్ని వారాలుగా ధరలు నిరంతరం పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. కొన్ని రోజుల క్రితం వరకు రూ. 250 లోపు ఉన్న కిలో స్కిన్‌లెస్ చికెన్ (Chicken Prices Hike)ధర ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో రూ. 340 నుండి రూ. 350 కి చేరింది.

Vivek Sharma: కన్నవారి కోసం.. ఏకంగా రూ.2.9 కోట్ల అమెరికా ఉద్యోగం వదులుకున్నాడు.. స్వగ్రామంలో కిరాణా కొట్టు..

చికెన్‌తో పాటు కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇటీవల వరకు డజను రూ. 80 లోపు లభించగా, ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 90 నుండి రూ. 100 వరకు పలుకుతోంది. దీనివల్ల రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ. 8 నుండి రూ. 8.50 కి చేరడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వేసవి ప్రభావంతో కోళ్ల ఉత్పత్తి తగ్గడం, పౌల్ట్రీ ఫీడ్ ఖర్చులు పెరగడం, సరఫరాలో లోపాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా వ్యాపారులు చెబుతున్నారు. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్, హోటళ్ల డిమాండ్ కూడా తోడవడంతో రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.