cheddi gang : తిరుపతి నగరంలో చెడ్డీగ్యాంగ్ కలకలం..అప్రమత్తమైన పోలీసులు

తిరుపతి నగరంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి నగరంలోని విద్యానగర్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లోకి చొరబడిన నలుగురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్ బీభత్సం సృష్టించారు.

cheddi gang in tirupathi city apartment  : తిరుపతి నగరంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి నగరంలోని విద్యానగర్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లోకి చొరబడిన నలుగురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్ బీభత్సం సృష్టించారు. మనుషుల అలికిడి లేని ఓ ఇంటి తాళాలు పగులగొట్టి, ఇంట్లోకి దూరిన గ్యాంగ్ నగదు, బంగారు దొరకకపోవడంతో వెనుదిరిగింది. తొలుత సాధారణ దొంగలుగా భావించిన పోలీసులు సదరు దోపిడీకి వచ్చినవారు చెడ్డీ గ్యాంగ్ గా అని తెలియడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. అపార్ట్మెంట్ సీసీ కెమెరాల్లో చెడ్డి గ్యాంగ్ దృశ్యాలు రికార్డు కావటంతో వారు చెడ్డీగ్యాంగ్ అని పోలీసులు నిర్ధారించుకుని వెంటనే అప్రమత్తమయ్యారు.తిరుపతి నగరంతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ కోసం గాలింపుముమ్మరం చేశారు.

Read more : హయత్‌నగర్‌లో చెడ్డీ గ్యాంగ్ బీభత్సం..వృద్ధురాలిపై దాడి..వరుస చోరీలు

తిరుపతి నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డ చెడ్డీగ్యాంగ్ కొద్దిసేపు అక్కడే డోర్లు తీసేందుకు నానా విధాలుగా యత్నించారు. ఎన్నిరకాలుగా యత్నించినా కుదరకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాచ్‌మన్ రూమ్, మెట్ల మార్గం, మొదటి అంతస్తులో అమర్చిన సీసీ కెమెరాల్లో దుండగుల దృశ్యాలు నమోదయ్యాయి. తిరుపతి నగరంలో చెడ్డీగ్యాంగ్ హల్ చల్ చేస్తోందని నిర్ధారించుకున్న పోలీసులు కొన్ని రోజుల క్రితం విద్యానగర్ చోరీలో చెడ్డీ గ్యాంగ్ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చెడ్డిగ్యాంగ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.3

Read more : సంక్రాంతి పండుగ దొంగలు : నగరంలో చెడ్డిగ్యాంగ్ ఎంటర్

 

ట్రెండింగ్ వార్తలు