హయత్‌నగర్‌లో చెడ్డీ గ్యాంగ్ బీభత్సం..వృద్ధురాలిపై దాడి..వరుస చోరీలు

  • Published By: veegamteam ,Published On : November 22, 2019 / 03:48 AM IST
హయత్‌నగర్‌లో చెడ్డీ గ్యాంగ్  బీభత్సం..వృద్ధురాలిపై దాడి..వరుస చోరీలు

హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిథిలో చెడ్డీ గ్యాంగ్ మరోసారి తమ ప్రతాపాన్ని చూపెట్టారు. వరుస చోరీలతో హల్ చల్ చేశారు. చెడ్డీ గ్యాంగ్ దోపిడీలపై పోలీసులు ఎంతగా నిఘా పెట్టిన వారి దోపిడీలు మాత్రం కొనసాగిస్తున్నారు. 

ఈ క్రమంలో హయత్ నగర్ పీఎస్ పరిధిలోని కుంట్లూరు గ్రామంలో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. ఓ ఇంట్లో రూ.70 వేలు, 15 తులాల బంగారు ఆభరణాలు ఇంకా విలువైన వస్తువులను దోచుకెళ్లారు.  మరో ఇంట్లో 4.5 తులాల బంగారం..నగదు విలువైన వస్తువులను దోచుకెళ్లారు. కేవలం ఇంట్లో ఉండే వస్తువులనే కాకుండా ఓ వృద్ధురాలి నుంచి చెవి దుద్దులు కూడా లాక్కెళ్లారు.దీంతో వృద్ధురాలికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు.

గ్రామస్తుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు చూస్తుండగానే దొంగలు పరారయ్యారు. ఫోన్ చేసిన గంట వరకూ పోలీసులు రాలేదనీ వచ్చిన తరువాత కూడా  దొంగలు పోలీసుల కళ్లముందే పారిపోతుంటే పట్టుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా..గత నెలలలో మూడు ఇళ్లలో చెడ్డీగ్యాంగ్ చోరీలకు పాల్పడింది. దీంతో భయం భయంగా గడపాల్సి వస్తోందని కాలనీ వాసులు వాపోతున్నారు. చెడ్డీగ్యాంగ్ ను పట్టుకోవటానికి  పోలీసులు సీరియస్ గా ప్రయత్నించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ చోరీలపై  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.