Chnadrababu : బిల్‌గేట్స్ ఒక్క నిమిషం మాత్రమే టైం ఇస్తా అన్నాడు.. కానీ ఢిల్లీకి పిలిపించి..

చంద్రబాబు బిల్‌గేట్స్ గురించి మాట్లాడుతూ.. బిలిగేట్స్ అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేస్తే ఒక పార్టీ ఉంది అక్కడికి వస్తే ఒక నిమిషం మాట్లాడతా అన్నారు. నేను నో చెప్పాను. నాకు కనీసం 10 నిముషాలు ఇవ్వండి. నేను పార్టీకి వస్తే.......................

Chnadrababu says about Billgates

Chnadrababu :  బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌ షో భారీ హిట్ అయి రికార్డులని కూడా సాధించడంతో ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహాలో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఎపిసోడ్ రిలీజైన కొద్దిసేపటికే ఇది వైరల్ గా మారింది.

ఇక మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం, బాలకృష్ణకు బావ అయిన చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి కూడా మాట్లాడారు. దీంట్లో భాగంగా అసలు బిల్‌గేట్స్ ని ఎలా కలిశారు, ఎలా ఇక్కడిదాకా రప్పించారు అని అడిగాడు బాలయ్య బాబు.

NTR : హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

చంద్రబాబు బిల్‌గేట్స్ గురించి మాట్లాడుతూ.. బిలిగేట్స్ అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేస్తే ఒక పార్టీ ఉంది అక్కడికి వస్తే ఒక నిమిషం మాట్లాడతా అన్నారు. నేను నో చెప్పాను. నాకు కనీసం 10 నిముషాలు ఇవ్వండి. నేను పార్టీకి వస్తే అందరూ తాగాను అనుకుంటారు అని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ ట్రై చేస్తే ఢిల్లీలో ఒక మీటింగ్ కి వస్తే కలుస్తా అన్నారు. రెండు రోజులు ప్రిపేర్ అయి వెళ్ళాను బిల్‌గేట్స్ ని కలవడానికి. పది నిముషాలు టైం ఇచ్చిన ఆయన 45 నిముషాలు నాతో మాట్లాడారు. నేను ఒకటే చెప్పా ఇండియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రావాలి అని మాట్లాడాను. అయన నేను చెప్పిందంతా విని ఓకే చెప్పి ఏం కావాలి అని అడిగితే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కి రావాలి అని అడిగాను. చాలా ఆలోచించి ఓకే చేశారు. హైదరాబాద్ కి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను. ఆ తర్వాత ఇక్కడి అభివృద్ధి చూసి బిల్‌గేట్స్ కూడా వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ సాఫ్ట్ వేర్ లో ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే అని తెలిపారు.