Kurnool : కర్నూలు జిల్లాలో చర్చి పాస్టర్ అరాచకం
కర్నూలు జిల్లాలో చర్చి పాస్టర్ దారుణానికి ఒడిగట్టాడు.. అభం శుభం తెలియని బాలికలను చర్చిలోకి తీసుకెళ్లి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
- kunduru Vinod
- Published On : November 13, 2021 / 10:36 AM IST
Kurnool
Kurnool : కర్నూలు జిల్లాలో చర్చి పాస్టర్ దారుణానికి ఒడిగట్టాడు.. అభం శుభం తెలియని బాలికలను చర్చిలోకి తీసుకెళ్లి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఘటన వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని చాగలమర్రి మండలంలో పాస్టర్ ప్రసన్న కుమార్ చర్చి నిర్వహిస్తున్నాడు.
చదవండి : Nalgonda : పెళ్లి పేరుతో 19 మంది యువతులను మోసం చేసిన కేటుగాడు
ఆ ప్రాంతంలోని పెద్దలు పనికి వెళ్లిన సమయంలో బాలికలను చర్చిలోకి తీసుకెళ్లి వారితో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రేయర్ పేరుతో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు పాస్టర్. తమపై పాస్టర్ చేస్తున్న అరాచకాలను తల్లిదండ్రులకు చెప్పారు బాలికలు.. ఆ తర్వాత ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న చాగలమర్రి పోలీసులు పాస్టర్ ప్రసన్న కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన పాస్టర్ ప్రసన్న కుమార్‌ను విచారిస్తున్నట్టు వెల్లడించారు. పాస్టర్‌పై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు పోలీసులు.
చదవండి : Catholic Church : లక్షల మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన క్యాథలిక్ చర్చి ఫాదర్లు
ఇక తాజాగా ఇటువంటిదే ఓ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. చర్చిలో పియానో వాయించే వ్యక్తి 19 మందిని మోసం చేశాడు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.
