CI Viral Video: జనసేన నాయకుడి చెంపచెళ్లుమనిపించిన మహిళా సీఐ.. అప్పుడు, మళ్లీ ఇప్పుడు..
అంజు ప్రవర్తనపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు.
- T Venkateshwarlu
- Updated on- July 12, 2023 / 03:41 PM IST
CI Video Viral
CI Video Viral – JanaSena: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని శ్రీకాళహస్తి(Srikalahasti)లో జనసేన నాయకులపై సీఐ అంజూయాదవ్ చేయిచేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై సీఎం జగన్ (YS Jagan) ఇటీవల పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో జనసేన కార్యకర్తలు శ్రీకాళహస్తిలో ఆందోళనకు దిగి, జగన్ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. వారిని చూసిన సీఐ అంజూ పరిగెత్తుకొచ్చి జనసేన నాయకులపై చేయి చేసుకున్నారు.
అంజు ప్రవర్తనపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. ” శ్రీకాళహస్తిలో ఈ రోజు ప్రశాంతంగా నిరసన తెలియచేస్తున్న జనసేన నాయకుడిపై అమానుషంగా వ్యవహరించిన పోలీసు అధికారిణి వ్యవహార శైలిని అందరూ ఖండించాలి. వైసీపీ ప్రాయోజిత నిరసనలకు బందోబస్తు చేస్తూ మానవ హక్కుల గురించి మరచిపోయారా? సదరు అధికారిణిపై చర్యలు తీసుకోవాలి ” అని డిమాండ్ చేశారు.
శ్రీకాళహస్తి ఐసీను వెంటనే సస్పెండ్ చేయాలని జనసేన డిమాండ్ చేసింది. చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి, కొట్టే సాయిపై ఆమె చేయి చేసుకున్నారని తెలిపింది. వైసీపీ కార్యకర్తలా ఆమె తీరు ఉందని మండిపడింది. ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన శతఘ్ని టీమ్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
