కూటమి అధికారంలోకి.. సెలవుపై విదేశాలకు సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్

చంద్రబాబుపై పలు కేసులు, ఆయన అరెస్టులో కీలక పాత్ర పోషించిన సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ సెలవుపై వెళ్తున్నారు.

CID Additional DG Sanjay

AP CID Chief Sanjay : ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. 175 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు 164 స్థానాల్లో విజయ దుందుబి మోగించారు. భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి రావడంతో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 9న అమరావతిలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఇదిలాఉంటే.. కూటమి అధికారంలోకి రావడంతో పలువురు ఉన్నతాధికారులు సెలవుపై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ సెలవుపై అమెరికా వెళ్తున్నారు.

Also Read : లోక్‌సభ ఫలితాల తర్వాత.. నితీశ్ కుమార్‌పై సోషల్ మీడియాలో హోరెత్తుతున్న మీమ్స్.. ఎందుకంటే?

చంద్రబాబుపై పలు కేసులు, ఆయన అరెస్టులో కీలక పాత్ర పోషించిన సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ సెలవుపై వెళ్తున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు సెలవు పెట్టారు. వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటనకు వెళ్లేందుకు ఆయన దరఖాస్తు చేసుకోగా.. సీఎస్ జవహర్ రెడ్డి వెంటనే అనుమతించడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి కూడా రాజీనామా చేశారు.