Kakinada : ఫోన్ తెచ్చిన తంటా.. కాకినాడలో కొట్టుకున్న లేడీ స్టూడెంట్స్.. వీడియో వైరల్.. సీఎం చంద్రబాబు సీరియస్

Kakinada : కాకినాడలోని ఎస్‌కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో విద్యార్థినీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో లేడీ స్టూడెంట్స్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

SK College of Nursing in Kakinada

Kakinada : కాకినాడలోని ఎస్‌కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో విద్యార్థినీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో లేడీ స్టూడెంట్స్ ఒకరిపై ఒకరు కర్రలు, వాటర్ క్యాన్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థినీలకు గాయాలు కావడంతో వారిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Also Read : Rain Alert : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

ఎస్‌కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో మణిపూర్‌కు చెందిన ఓ విద్యార్థిని తన ఫోన్ పోయిందంటూ ఇటీవల సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, మణిపూర్ విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఫోన్ దొరికినప్పటికీ వీరి మధ్య గొడవ సర్దుమణగకపోవడంతో ఇరు వర్గాలకు చెందిన విద్యార్థినిలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి.

సీఎం చంద్రబాబు సీరియస్..
విద్యార్థినుల ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ రంగంలోకిదిగి విద్యార్థినుల భద్రతకు చర్యలు చేపట్టారు. విద్యార్థినుల వసతి గృహాన్ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. అక్కడి పరిస్థితులపై ఆరాతీశారు.

స్పందించిన కలెక్టర్, ఎస్పీ ..
విద్యార్థినుల మధ్య ఘర్షణపై కాకినాడ కలెక్టర్, ఎస్పీ స్పందించారు. విద్యార్థినుల మధ్య ఘర్షణ పూర్తిగా పరిష్కారమైందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. ఫోన్ చోరీ విషయంలో మణిపూర్, నాగాలాండ్ విద్యార్థులు, స్థానిక విద్యార్థుల మధ్య వివాదం నెలకొందని, ఇప్పటికే ఫోన్ రికవరీ చేసి బాధిత విద్యార్థికి అందజేయడం జరిగిందని అన్నారు. సమాచారం అందగానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని, విద్యార్థినులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, సర్టిఫికెట్ల చోరీ, ఫీజుల ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. విద్యార్థినులను  తొలగించారన్న ప్రచారం కూడా అవాస్తవమని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు తాత్కాలికంగా మరో హాస్టల్ కేటాయించడం జరిగింది. ఇతర రాష్ట్రాల విద్యార్థినుల రక్షణకు ఎలాంటి ఇబ్బంది లేదని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్, ఎస్పీ తెలిపారు.