Cm Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు- సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్

ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా అధిగమిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు.

  • Published On : March 30, 2026 / 07:44 PM IST

 

Cm Chandrababu: వైసీపీ పాలనలో పేదల కడుపు కొట్టారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అవినీతి, అధికార దుర్వినియోగంతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం 816 కోట్ల రూపాయల అప్పు చేసిందన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూడూరులో టిడ్కో ఇళ్లను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. లబ్దిదారులకు ఇళ్లను పంపిణీ చేశారు. గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు.

2029 నాటికి ప్రతి పేద వాడికి ఇల్లు కట్టిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా అధిగమిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండోసారి గృహ ప్రవేశాలు చేస్తున్నామన్నారు చంద్రబాబు. రెండున్నర లక్షల ఇళ్లు గృహప్రవేశం చేస్తున్నామంటే ఒక చరిత్ర అని చంద్రబాబు అన్నారు.

”ప్రతి పేద కుటుంబానికి శాశ్వత ఇల్లు నిర్మించి ఇవ్వాలని మా సంకల్పం. ఇది టీడీపీ సిద్ధాంతం. 2029 నాటికి.. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చే బాధ్యత నాది” అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఏపీ టౌన్ షిప్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ (ఏపీ టిడ్కో) నిర్మించిన లక్ష ఇళ్లను లబ్దిదారులకు అందించారు. 2016లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4లక్షల 52వేల ఇళ్లను మంజూరు చేసింది. వాటి నిర్మాణ బాధ్యతలను టిడ్కోకు అప్పగించింది. టిడ్కో టెండర్లు పిలిచి కాంట్రాక్టులు కూడా అప్పగించింది. అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కదలిక వచ్చింది. పెండింగ్ ఇళ్ల నిర్మాణం మొదలైంది.

Also Read: గత ప్రభుత్వ హయాంలో కేసులు.. సీఎం చంద్రబాబుకి భారీ ఊరట.. 3 పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు