Tdp Mahanadu: నెల్లూరులో రద్దు.. టీడీపీ మహానాడుపై చంద్రబాబు కీలక నిర్ణయం..
పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుకు పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, అధికార ప్రతినిధులు ఆహ్వానితులుగా ఉన్నారు.
- Naveen
- Updated on- May 15, 2026 / 08:22 PM IST
Tdp Mahanadu: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం మహానాడుపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి మహానాడు వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలు తీసుకుంటున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగానే ఈసారి వర్చువల్ గా మహానాడును నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ మహానాడు నిరాడంబరంగా జరపాలని డెసిషన్ తీసుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వర్చువల్ గా మహానాడులో చంద్రబాబు, లోకేశ్ పాల్గొంటారు.
నెల్లూరులో మూడు రోజుల మహానాడు స్థానంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో 27, 28 తేదీల్లో వర్చువల్ గా మహానాడు నిర్వహించనున్నారు. హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహణకు పూనుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్టేజ్ ఏర్పాటు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిజికల్ గా, జిల్లాల నుంచి వర్చువల్ గా మహానాడుకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుకు పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, అధికార ప్రతినిధులు ఆహ్వానితులుగా ఉన్నారు.
నియోజకవర్గాల నుంచి ఆన్ లైన్ విధానంలో మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపిలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1848 క్లస్టర్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు మహానాడుకు ఆన్ లైన్ లో ఆయా క్లస్టర్ల నుంచి హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తీర్మానాలు సహా ఇతర అన్ని అంశాల్లోను మహానాడు విధానాలనే పాటిస్తూ హైబ్రిడ్ మోడల్ లో మహానాడు నిర్వహణ ఉంటుంది.
Also Read: ఆయనతో నన్ను పోల్చకండి- విజయ్ విజయంపై పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్
