Nethanna Sevalo Scheme: నేతన్న నిధులు రూ.25000 వచ్చేశాయి.. మీకు రాకపోతే ఇలా చేయండి..

Nethanna Sevalo Scheme : నేతన్న సేవలో పథకంలో భాగంగా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ. 25వేల ఆర్థిక సాయంను ప్రభుత్వం అందజేయనుంది.

AP CM Chandrababu Naidu Launch Nethanna Sevalo Scheme

Nethanna Sevalo Scheme : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చేనేతలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో నేతన్న సేవలో పథకానికి శ్రీకారం చుట్టింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించిన సభలో ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించారు.

Also Read – ADR Political Donations Report : రాజకీయ పార్టీల విరాళాల్లో భారీ మార్పులు.. బీఆర్ఎస్‌కు షాక్, వైసీపీకి పెరిగిన విరాళాలు.. టీడీపీకి తగ్గిన నిధులు..

నేతన్న సేవలో పథకంలో భాగంగా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ. 25వేల ఆర్థిక సాయం అందజేస్తున్నారు. మొత్తం 71,636 చేనేత కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుండగా.. రూ.170కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. చేనేత కార్మికులంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని.. చేనేత కార్మికుల కష్టాలు తనకు తెలుసని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేతల కోసం తాను పోరాటం చేశానని గుర్తు చేశారు. చీరాలకు రావడం తన అదృష్టమన్నారు. చీరాల చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. చీరాట పట్టు, కాటన్ చీరలకు విశేష ఆదరణ ఉందని చెప్పారు. , చేనేత వైభవాన్ని మళ్లీ తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

డబ్బులు రాకుంటే ఇలా చేయండి..

  • నేతన్న సేవలో పథకానికి అర్హత కలిగి ఉండి.. మీ అకౌంట్లోకి డబ్బులు పడని లబ్ధిదారులు అధికారులను సంప్రదించాలి.
  • మీ స్థానిక గ్రామ లేదంటే వార్డు సచివాలయం సంక్షేమ సహాయకుడిని కలవాలి. నేతన్న సేవలో అర్హుల జాబితాలో మీరు ఉందో లేదో పరిశీలించాలి.
  • సాంకేతిక సమస్యలు లేదా దరఖాస్తులో పొరపాట్లు ఉంటే సచివాలయంలో దరఖాస్తు స్థితిని తెలుసుకోవాలి.
  • మీ ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా సరిగ్గా అనుసంధానం అయిందో లేదో బ్యాంక్‌లో చెక్ చేయాలి.
  • ఏదైనా లోపాలు ఉంటే అధికారులను సంప్రదించి మళ్లీ పథకంకు దరఖాస్తు చేసుకోవాలి.