Tirumala Laddu Row: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై ఏపీ అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కల్తీలో కుట్ర కోణం ఉందని చంద్రబాబు ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలకు వెళ్లే బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం చేశారని చంద్రబాబు అన్నారు. ఇదంతా ఏదో జరిగిపోయిందని అనుకోవడానికి లేదని, కావాలని పద్ధతి ప్రకారం వేంకటేశ్వరస్వామి పవిత్రతను దెబ్బతీసేందుకు చేసిన కుట్రగా చంద్రబాబు అభివర్ణించారు.
59.71 లక్షల కేజీల కల్తీ నెయ్యిని వాడారని ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు చెప్పారు. రూ.234.51 కోట్ల నిధుల అక్రమాలు జరిగాయన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తూ వచ్చారని చంద్రబాబు అన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం టెండర్ నిబంధనలను మార్చిందన్నారు.
కేజీ నెయ్యి రూ.329కి ఇచ్చేలా భోలేబాబాకు టెండర్లు ఇచ్చారని.. భోలేబాబా, శ్రీవైష్ణవి, ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కు చెందిన నెయ్యి కల్తీ అని సీఎఫ్ టీఆర్ఐ నివేదిక ఇచ్చిందన్నారు. నాణ్యత లేని ప్రసాదం పంపిణీ చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారని చంద్రబాబు తెలిపారు. తక్కువ ధరకు నెయ్యి ఇస్తున్నారంటే ఓసారి ఆలోచన చేయాలన్నారు. ఇదంతా చూస్తుంటే ఇందులో అవినీతి లేదా కుట్ర కోణం ఉందని అర్థమవుతోందన్నారు. కెమికల్స్ తో నెయ్యి చేశారని చంద్రబాబు ఆరోపించారు.
Also Read: రూటు మార్చిన జగన్? వైఎస్సార్ సన్నిహితులతో మంతనాలు అందుకోసమేనా?