CM Jagan: ఎమ్మెల్యే రోజాకు సీఎం పరామర్శ
చెన్నై అడయార్ లోని ఫోర్టీస్ మలర్ హాస్పిటల్ సర్జరీలు చేయించుకున్న ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ..
- Subhan Ali Shaik
- Updated on- April 2, 2021 / 10:54 PM IST
Cm Jagan
CM Jagan: చెన్నై అడయార్ లోని ఫోర్టీస్ మలర్ హాస్పిటల్ సర్జరీలు చేయించుకున్న ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏపీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఫోన్ లో ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల గురించి ఆలోచించి.. ఆందోళన పడాల్సిన పనిలేదని ప్రశాంతంగా ఉండాలని ధైర్యం చెప్పారు.
ఐదు రోజులుగా చెన్నైలో చికిత్స పొందుతున్న రోజా హెల్త్ కుదుటగా ఉన్నట్లు సెల్వమణి ఆడియో ద్వారా తెలియజేశారు. రెండు మేజర్ ఆపరేషన్లు ఎదుర్కొన్న ఆమెకు మరి కొద్ది రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు చెబుతున్నారు.
అభిమానులు హాస్పిటల్ కు రావొద్దని ఆరోగ్యం కాస్త మెరుగ్గా అనిపించాక రోజానే కలుస్తారని చెప్పారు. గతంలోనే జరగాల్సిన ఈ ఆపరేషన్లు కరోనా కారణంతో వాయిదా వేసినట్లు వివరించారు.
