రైతులకు సీఎం జగన్ శుభవార్త, అక్టోబర్ 27న ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు

  • Publish Date - October 20, 2020 / 02:30 PM IST

cm jagan: ఏపీ సీఎం జగన్ రైతులకు శుభవార్త వినిపించారు. అక్టోబర్ 27న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు జమ చేస్తామన్నారు. స్పందన కార్యక్రమంపై జగన్ సమీక్ష నిర్వహించారు. అలాగే వర్షాలతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు.




ఇళ్లు కూలిపోయిన వారికి వెంటనే సాయం చేయాలని అధికారులతో చెప్పారు. అలాగే దెబ్బతిన్న రహదారుల మరమ్మత్తులు చేయాలన్నారు. అక్టోబర్ 31 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలని అధికారులతో చెప్పారు. బడ్జెట్ ప్రతిపాదనలు కూడా అక్టోబర్ 31 నాటికి పూర్తి చేయాలన్నారు.