ysr asara scheme ప్రారంభం..అకౌంట్లో డబ్బులు చెక్ చేసుకోండి

  • Publish Date - September 11, 2020 / 12:29 PM IST

Andhra Pradesh CM : కష్టకాలంలోనైనా సరే..సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ..దూసుకపోతున్నారు సీఎం జగన్. ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూ..లబ్దిదారుల అకౌంట్లలో డబ్బు జమ చేస్తున్నారు. తాజాగా..వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…



నాలుగు విడతల్లో నిధులు మంజూరు చేస్తామన్నారు. తొలి విడత కింద..రూ. 6 వేల 792 కోట్లు జమ చేయడం జరిగిందని, మొత్తం రూ. 27 వేల 168 కోట్లు కేటాయించింది. డబ్బులు ఎలా వాడుకుంటారో..వారిష్టమని, ఈ డబ్బును పెట్టుబడిగా మార్చుకొని బ్యాంకుల నుంచి మరింత రుణం తీసుకుని మరైదేైనా వ్యాపారం చేసుకోవాలని అనుకుంటే..వీటికి సంబంధించి..వారికి సహయం చేస్తామన్నారు.
https://10tv.in/cm-jagan-convoy-gives-way-to-ambulance/
ఐటీసీ, అమూల్, రిలయెన్స్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఇతర సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకొనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వీరిని, బ్యాంకులను కలిపి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఉత్పత్తిలను ఆయా సంస్థలు మార్కెటింగ్ చేసుకుంటాయన్నారు.



స్వయం సంఘాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మెప్నా, సెర్ఫ్ అధికారులను సంప్రదించవచ్చని, 1902కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. బ్యాంకు, కంపెనీ యాజమాన్యాలతో మాట్లాడి లబ్ది దారుకు మేలు జరిగే విధంగా చూస్తామన్నారు.

మహిళా సాధికారిత కోసం..దేశంలో ఎక్కడ లేని విధంగా..తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్నామన్నారు. అమ్మ కడుపులో బిడ్డల నుంచి అవ్వల వరకు సంక్షేమం అందాలని, వారిని ఆదుకోవాలని సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నామన్నారు సీఎం జగన్.



8,71,302 పొదుపు సంఘాలకు లబ్ది.
87,74,674 మంది మహిళలకు ఆర్థిక సాయం.
రూ.27,168.83 కోట్ల రుణాలు.
నాలుగు విడతల్లో పొదుపు ఖాతాల్లో జమ.
తొలి విడతలో రూ.6,792.20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా అకౌంట్లో జమ.

ట్రెండింగ్ వార్తలు