Jagan bus Yatra : అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర.. చింతపాలెం వద్ద బహిరంగ సభ.. రూట్ మ్యాప్ ఇదే..

19వ రోజు బస్సు యాత్రను గోడిచర్ల ప్రాంతం నుంచి ఉదయం 9గంటలకు సీఎం జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా ..

Jagan Siddham Bus Yatra : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఆ బస్సు యాత్ర శనివారం 19వ రోజుకు చేరుకుంది. శుక్రవారం రాత్రి గోడిచర్ల ప్రాంతం వద్ద బస చేసిన జగన్.. శనివారం ఉదయం 9గంటలకు బస్సు యాత్ర ద్వారా బయలుదేరుతారు. ఈ యాత్ర అనకాపల్లి బైపాస్ మీదుగా రాత్రికి చిన్నయ్యపాలెం వద్దకు చేరుకుంటుంది. అక్కడే సీఎం జగన్ బస చేస్తారు. ఈరోజు మొత్తం 70 కిలోమీటర్ల మేర జగన్ రోడ్ షోలో పాల్గొంటారు. బస్సుయాత్రను విజయవంతం చేసేందుకు వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

Also Read : Srikalahasti Race Gurralu : టీడీపీ వర్సెస్ వైసీపీ.. ముక్కంటి ఇలాకాలో హోరాహోరీ

సీఎం పర్యటన ఇలా..
సీఎం జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారం ఉదయం 9గంటలకు పాయకరావుపేట నియోజకవర్గం గొడిచెర్ల నుంచి ప్రారంభమవుతుంది. ఉద్దండపురం, కాగిత, సీతంపాలెం, నక్కపల్లి, అడ్డరోడ్డు, పులపర్తి, రేగుపాలెం, యలమంచిలి బైపాస్ మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు అచ్చుతాపురం చేరుకుంటుంది. అక్కడ సీఎం జగన్ భోజనం విరామం తీసుకుంటారు. అనంతరం కశింకోట మండలం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చింతపాలెం వద్దకు జగన్ చేరుకుంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.

 

బహిరంగ సభ అనంతరం తాళ్లపాలెం జంక్షన్, బయ్యవరం, కశింకోట, కొత్తూరు, అనకాపల్లి జంక్షన్-1, జంక్షన్ -2, శంకరం, రేబాక, మర్రిపాలెం టోల్ గేట్, దేవీపురం, అస్కపల్లి మీదుగా రాత్రి 8.30 గంటలకు సబ్బవరం మండలంలోని చిన్నయ్యపాలెం వద్దకు జగన్ బస్సు యాత్ర చేరుకుంటుంది. చిన్నయ్యపాలెంలో ఓ వెంచర్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో జగన్ మోహన్ రెడ్డి బస చేస్తారు.

Also Read : YS Vijayamma : ‘హ్యాపీ బర్త్‌డే మా..’ అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు.. వైఎస్ జగన్, షర్మిల

 

ట్రెండింగ్ వార్తలు