CM Jagan: జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష సర్వేపై సీఎం జగన్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఈ పథకం చురుగ్గా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.

Cm Jagan

CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఈ పథకం చురుగ్గా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కొవిడ్‌ పరిస్థితుల కారణంగా మందగమనంలో ఉంచేయకుండా పరుగులు పెట్టించాలి. లక్ష్యాలను అనుకున్న సమయంలోగా చేరాలి.

క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి. ఈ పథకాన్ని పూర్తిచేయడానికి అంకిత భావంతో పనిచేయాలి. మారుమూల ప్రాంతాల్లో సర్వేకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి. సిగ్నల్స్‌ సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను రెడీ చేసుకోండి. ఈ మేరకు కావాల్సిన ఆదేశాలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

సర్వే ఆలస్యంగా కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు.. ప్రజలకు అన్నిరకాల సేవలు అందించేలా గ్రామ, వార్డు సచివాలయాలు రెడీ అవ్వాలి. ప్రస్తుతం అందిస్తోన్న జనన, మరణ ధృవీకరణపత్రాల్లోనే అన్నిరకాల సర్టిఫికెట్లు సచివాలయాల్లోనే అందేలా చూడాలి. సిబ్బంది శిక్షణ కార్యక్రమాల మాన్యువల్‌ను డిజిటిల్‌ ఫార్మాట్‌లో పెట్టి.. వారు ఎప్పుడు కావాలంటే.. అప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకుని సందేహాలు తీర్చుకునేలా అందుబాటులో ఉంచాలి.

యూజర్‌ మాన్యువల్, తరచుగా వచ్చే ప్రశ్నలకు సందేహాలు వారికి అందుబాటులో డిజిటిల్‌ ఫార్మాట్‌లో ఉంచాలి. సచివాలయాల్లోని సిబ్బందికి ఇస్తున్న అన్నిరకాల శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి ఈ ఫార్మాట్‌లో వివరాలు పొందుపరచాలి. సమయానికి తెలుసుకునేందుకు వీలుగా డిజిటిల్‌ లైబ్రరీని అందుబాటులో ఉంచి ఇన్ఫర్మేషన్ రెడీ చేయాలి.