AP Govt : నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వం ప్రత్యేక కాల్‌ సెంటర్.. సురక్షితంగా తీసుకొస్తామని మంత్రి లోకేశ్‌ భరోసా

AP Govt : నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వం ప్రత్యేక కాల్‌ సెంటర్.. సురక్షితంగా తీసుకొస్తామని మంత్రి లోకేశ్‌ భరోసా

AP Govt : నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వం ప్రత్యేక కాల్‌ సెంటర్.. సురక్షితంగా తీసుకొస్తామని మంత్రి లోకేశ్‌ భరోసా

AP Govt on Nepal protests

Updated On : September 10, 2025 / 3:06 PM IST

AP Govt on Nepal protests : నేపాల్‌లో జెన్‌-జడ్‌ నిరసనలతో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే నేపాల్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మరోవైపు.. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ వాసుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాక.. ఆర్టీజీఎస్ లో ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.

Also Read: Nepal Protests: నేపాల్‌లో హింస.. మాజీ ప్రధాని భార్య సజీవదహనం.. షాకింగ్ వీడియో..

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో అధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో నేపాల్‌లో చిక్కుకున్న పలువురు తెలుగువారితో మంత్రి వీడియో కాల్‌లో మాట్లాడారు. వారు అక్కడి పరిస్థితిని లోకేశ్ కు వివరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 240 మంది తెలుగు వారు నేపాల్ లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. కాఠ్‌మాండూ నుంచి విశాఖకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి వారిని రాష్ట్రానికి రప్పించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు.

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారికోసం ఆర్టీజీఎస్ లో ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు నేపాల్‌లో చిక్కుకుపోయి ఏదైనా అత్యవసర సహాయం లేదా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే..
ఢిల్లీలోని ఏపీ భవన్ : +91 9818395787
రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) : 08632381000, ఎక్స్‌టెన్షన్ నెంబర్ : 8001, 8005
APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు: 0863 2340678, వాట్సాప్: +91 8500027678.
ఇమెయిల్:helpline@apnrts.com,info@apnrts.com లనైనా సంప్రదించగలరు.
మరోవైపు కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయంలోనూ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. +977-980 860 2881 /+977- 981 032 6134 నంబర్లకు సాధారణ కాల్స్‌తో పాటు వాట్సప్‌లోనూ సంప్రదించవచ్చని పేర్కొన్నారు.