CM Jagan : వైభవంగా వకుళామాత ఆలయ మహాసంప్రోక్షణ, సంప్రదాయ దుస్తుల్లో హాజరైన సీఎం జగన్

తిరుపతికి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ) వద్ద నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది. సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

CM Jagan : తిరుపతికి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ) వద్ద నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది. సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్ కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులు ధరించి, ఆలయ పుష్కరిణిలోకి వెళ్లిన సీఎం జగన్ నీటిని తలమీద చల్లుకున్నారు. ఆ తరువాత టీటీడీ అధికారిక వృక్షం మానుసంపంగి మొక్క నాటారు.

Vakulamata : వకుళమాత ఆలయంలో శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం

అక్కడి నుంచి ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణు భట్టాచార్య.. అర్చకులతో కలసి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించిన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. అక్కడి నుంచి మేళతాళాల నడుమ ప్రదక్షణగా ఆలయంలోకి చేరుకున్న సీఎం జగన్.. శ్రీ వకుళమాతను దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వాదం చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. ముఖ్యమంత్రికి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన శ్రీ వకుళమాత ఫొటో ఫ్రేమ్, తీర్థప్రసాదాలు అందించారు.

Vakula Matha : వ‌కుళమాత‌ ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు అంకురార్పణ

డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, సత్యనారాయణ, మంత్రి రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జంగాల పల్లి శ్రీనివాసులు, చింతల రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, మేడా మల్లిఖార్జున రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ట్రెండింగ్ వార్తలు