Vakulamata : వకుళమాత ఆలయంలో శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం

తిరుపతి సమీపంలోని పేరూరులో(పాతకాలవ) టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీవకుళమాత ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాల్లో ఆదివారం శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం నిర్వ‌హించారు.

Vakulamata : వకుళమాత ఆలయంలో శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం

Vakulamata

Vakulamata :  తిరుపతి సమీపంలోని పేరూరులో(పాతకాలవ) టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీవకుళమాత ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాల్లో ఆదివారం శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉద‌యం 6.30 నుండి 11 గంట‌ల వ‌ర‌కు పుణ్యాహ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, అక‌ల్మ‌ష‌హోమం, అక్షిమోచ‌నం జరిగింది. పంచగవ్యాలైన గోక్షీరం(పాలు), గోదధి(పెరుగు), నెయ్యి, గోమయం, పంచితంతో శిలావిగ్రహాన్ని శుద్ధి చేశారు.

సాయంత్రం 6.30 గంట‌లకు అగ్నిప్ర‌తిష్ట‌, క‌ల‌శ‌స్థాప‌న‌, కుంభావాహ‌నం, కుంభారాధ‌న‌, ఉక్త హోమాలు నిర్వ‌హిస్తారు. ఈ కార్యక్రమంలో ఆగమ సలహా దారు శ్రీ వేదాంతం విష్ణు భట్టాచార్య, టీటీడీ కి చెందిన ఇతర అధికారులు పాల్గోన్నారు.