Hyderabad : హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. మూడ్రోజులు అప్రమత్తంగా ఉండండి.. ఆ సమయాల్లో బయటకు రావొద్దు..

Hyderabad : చలిపులి చంపేస్తోంది. హైదరాబాద్ నగరంలో అత్యల్ప స్థాయికి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Hyderabad : హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. మూడ్రోజులు అప్రమత్తంగా ఉండండి.. ఆ సమయాల్లో బయటకు రావొద్దు..

Hyderabad Cold winds

Updated On : December 15, 2025 / 12:32 PM IST

Hyderabad Cold winds : చలిపులి చంపేస్తోంది. హైదరాబాద్ నగరంలో అత్యల్ప స్థాయికి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే వణికిపోవాల్సిన పరిస్థిది నెలకొంది. ప్రధానంగా చిన్నపిల్లలు, సీనియర్‌ సిటిజన్లు ఈ చలి తీవ్రత పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read : Ration Card : రేషన్ కార్డు దారులకు బిగ్ షాకింగ్ న్యూస్.. అలా చేయకుంటే రేషన్ కట్..! హెచ్చరికలు జారీ..

హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో రాబోయే మూడ్రోజులు ఉదయం చలిగాలులు తీవ్రంగా ఉంటాయని, జీహెచ్ఎంసీ సర్కిళ్లలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్ నుంచి 12 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని అంచనా వేసింది. ఈ కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.

భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన వివరాల ప్రకారం.. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ప్రజలు చలి తీవ్రతను తట్టుకొనేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రాబోయే రెండుమూడు రోజులు అంటే ఈనెల 17వ తేదీ వరకు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి మరియు మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ సంస్థ అంచనా వేసింది.

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) ప్రకారం.. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అల్వాల్, సికింద్రాబాద్ మరియు కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో డిసెంబర్ 17వ తేదీ వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వచ్చేటప్పుడు చలి నుంచి రక్షణగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని టీజీడీపీఎస్ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు సాయంత్రం వేళల్లో బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చినా చలి నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.