M.S.Subbulakshmi Biopic: తెరపైకి లెజెండరీ సింగర్ ‘ఎంఎస్ సుబ్బలక్ష్మి’ జీవితం.. శ్రీకారం చుట్టిన గీతా ఆర్ట్స్.. ఎవరు నటిస్తున్నారో తెలుసా?

తెలుగులో మరో లెజెండర్ పర్సన్ బయోపిక్ తెరకెక్కనున్నట్టుగా తెలుస్తోంది. ఆ లెజెండరీ పర్సన్ ఎవరో కాదు ప్రముఖ సింగర్ ఏంఎస్ సుబ్బలక్ష్మి(M.S.Subbulakshmi Biopic).

M.S.Subbulakshmi Biopic: తెరపైకి లెజెండరీ సింగర్ ‘ఎంఎస్ సుబ్బలక్ష్మి’ జీవితం.. శ్రీకారం చుట్టిన గీతా ఆర్ట్స్.. ఎవరు నటిస్తున్నారో తెలుసా?

Geetha Arts banner planning famous singer MS Subbulakshmi biopic

Updated On : December 15, 2025 / 12:16 PM IST

M.S.Subbulakshmi Biopic: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా ప్రముఖుల జీవితాలను తెరపైకి తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూస్తున్నారు మేకర్స్. ఆడియన్స్ కూడా అలాంటి సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు. ఇప్పటికే, తెలుగులో మహానటి, మహానాయకుడు, కథానాయకుడు లాంటి బయోపిక్ లు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో లెజెండర్ పర్సన్ బయోపిక్ తెరకెక్కనున్నట్టుగా తెలుస్తోంది. ఆ లెజెండరీ పర్సన్ ఎవరో కాదు ప్రముఖ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి(M.S.Subbulakshmi Biopic). ఈమె జీవిత కథను తెరపైకి తీసుకురావాలని బలంగా ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత అల్లు అరవింద్.

Bigg Boss 9 Telugu: కప్పు ముఖ్యం బిడ్డ.. భరణి ఎమోషనల్ కామెంట్స్.. కాళ్ళు మొక్కిన తనూజ..

ఇప్పటికే ఈ కథకు సంబందించిన చర్చలు కూడా కంప్లీట్ అయ్యాయట. మళ్ళీరావా, జెర్సీ, కింగ్డమ్ లాంటి ఎమోషనల్ కథలతో సినిమాలు చేసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడట. ఇప్పటికే కథ చర్చలు కూడా కంప్లీట్ అవడంతో త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్ర ఎవరు చేస్తే బాగుటుందని తర్జనభర్జన పడ్డారట మేకర్స్. ఫైనల్ గా మలయాళ బ్యూటీ సాయి పల్లవి అయితేనే ఆ పాత్రకు సహజత్వం వస్థుంది అని ఫిక్స్ అయ్యారట. ఇదే కనుక నిజం అయితే, సాయి పల్లవి కెరీర్ లో ఇది ఒక మైలురాయిగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. మరి ఈ సినిమా కూడా మహానటి సినిమా రేంజ్ లో హిట్ అవుతుందా అనేది చూడాలి.