Dekh Lenge Saala Song: పవన్ డాన్స్ కి సోషల్ మీడియా షేక్.. చికిరి రికార్డ్స్ అవుట్.. టాప్ లో “దేఖ్ లేంగే సాలా” సాంగ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'దేఖ్ లేంగే సాలా(Dekh Lenge Saala Song)' సాంగ్ సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తోంది.

Dekh Lenge Saala Song: పవన్ డాన్స్ కి సోషల్ మీడియా షేక్.. చికిరి రికార్డ్స్ అవుట్.. టాప్ లో “దేఖ్ లేంగే సాలా” సాంగ్..

'Dekh Lenge Saala' song record views in 24 hours.

Updated On : December 15, 2025 / 12:48 PM IST

Dekh Lenge Saala Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైనమిక్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఈ కాంబో నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాను ఒక రేంజ్ లో సెట్ చేస్తున్నాడు హరీష్ శంకర్. ఇప్పటికే, ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ కి భారీ రెస్పాన్స్ రాగా.. తాజాగా “దేఖ్ లేంగే సాలా(Dekh Lenge Saala Song)” అనే పాటను విడుదల చేశారు మేకర్స్.

M.S.Subbulakshmi Biopic: తెరపైకి లెజెండరీ సింగర్ ‘ఎంఎస్ సుబ్బలక్ష్మి’ జీవితం.. శ్రీకారం చుట్టిన గీతా ఆర్ట్స్.. ఎవరు నటిస్తున్నారో తెలుసా?

ఈ సాంగ్ సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట రిలీజ్ అయిన కేవలం 24 గంటల్లోనే ఏకంగా 29.6 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. 24 గంటల్లో ఈ రేంజ్ లో వ్యూస్ సాధించిన పాటగా “దేఖ్ లేంగే సాలా” రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతకు ముందు ఈ రికార్డ్ రామ్ చరణ్ పెద్ది “చికిరి” పేరుమీద ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ చేసి టాప్ లో నిలిచింది “దేఖ్ లేంగే సాలా” సాంగ్. ఇక ఈ పాట ఈ రేంజ్ లో హిట్ అవడానికి కారణం పవన్ కళ్యాణ్ డాన్స్ అనే చెప్పాలి. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్టెప్స్ వేశారు.

ఆ క్రెడిట్ మాత్రం దర్శకుడు హరీష్ శంకర్ దే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన నుంచి ప్రస్తుతం ఎలాంటివి కోరుకుంటున్నారు అని పక్కా ప్లాన్ వేసి “దేఖ్ లేంగే సాలా” సాంగ్ ను దించాడు. దాంతో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ విషయంలో హరీష్ శంకర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ ఒక్క సింగ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ కి వెళ్లాయి. సినిమా కూడా సాంగ్ లాగానే భారీ విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2026 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరి సాంగ్ తోనే ఈ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ సినిమాతో ఏ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు అనేది చూడాలి.